Commissioner Anupama Anjali inspected the night sweeping at midnight
అర్ధరాత్రి నైట్ స్వీపింగ్ ను పరిశీలించిన కమిషనర్ అనుపమ అంజలి
సాక్షిత తిరుపతి : ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుపతి నగరం శుభ్రత విషయంలో దేశంలో తిరుపతి నగరపాలక సంస్థ ఖ్యాతిని పెంచుతామని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి అన్నారు. తిరుపతి నగరంలో జరుగుతున్న నైట్ స్వీపింగ్ పనులను రాత్రి సమయంలో అకస్మాత్తుగా పరిశీలించి కార్మికులకు తగు సూచనలు చేసారు.
తిరుపతి నగరానికి దేశంలోనే ఓక ప్రత్యేక స్థానమున్న విషయాన్ని ప్రస్థావిస్తూ నగర ప్రజలతోబాటు అనేక రాష్ట్రాల నుండి స్వామి వారి దర్శనానికి వస్తున్న యాత్రీకులను దృష్టిలో వుంచుకొని తిరుపతి నగరాన్ని అన్ని వేళలా పరిశుభ్రంగా వుంచుకోవాల్సిన భాధ్యత మనందరిపై వుందన్నారు.
తిరుపతి నగరంలో పగలు శుభ్రతకు పనిచేసే కార్మికులతో బాటు అదనంగా రాత్రులనందు చెత్తను శుభ్రం చేసేందుకు ప్రత్యేకంగా 20 మంది కార్మికులను, ఇద్దరు డ్రైవర్లను కొత్తగా పనుల్లోకి తీసుకోవడం జరిగిందని వివరిస్తూ, వీరికి సంవత్సరానికి 47.50 లక్షలు ఏజెన్సీ ద్వారా కౌన్సిల్ అనుమతితో తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కేటాయించడం జరిగిందని కమిషనర్ అనుపమ తెలిపారు.
ప్రతిరోజు రాత్రి 9:30 గంటల నుండి ఉదయం 4:30 గంటల వరకు 22 మంది కార్మికులు రోడ్లను శుభ్రపరచడం, డస్ట్ బీన్లను తీయడం చేస్తున్నారని, గత వారం రోజులుగా నగరంలోని అన్నమయ్య సర్కిల్ నుండి ఎం.ఆర్.పల్లె సర్కిల్ వైపుగా వెస్ట్ చర్చ్ సర్కిల్ వరకు, అదేవిధంగా ఎన్టీఆర్ సర్కిల్ నుండి మెడికల్ కాలేజ్ వివేకానంద సర్కిల్ వరకు మునిసిపల్ కార్పొరేషన్ ఆరోగ్య విభాగం హెల్త్ ఆఫిసర్ డాక్టర్ హరికృష్ణ నిర్వహణలో శానిటరీ సూపర్ వైజర్ చెంచెయ్య పర్యవేక్షణలో 11 మంది కార్మికులు పనిచేస్తూన్నారని, అదేవిధంగా మరో 11 మంది కార్మికులు శానిటరి సూపర్ వైజర్ సుమతీ పర్యవేక్షణలో ఆర్టీసీ బస్ స్టాండ్ ముందర, రైల్వే స్టేషన్ ముందర, గ్రూపు థీయేటర్స్, జయశ్యాం థీయేటర్ రోడ్డు ప్రాంతల్లో శుభ్రం చేస్తున్నట్లు కమిషనర్ అనుపమ వివరించారు
. ఈ సందర్భంగా సూపర్ వైజర్లకు సూచనలు ఇస్తూ నగరంలోని 130 గార్బెజ్ పాయింట్ల వద్దనున్న చెత్తను తొలగించే పనులను చేపట్టాలన్నారు. సేకరించిన చెత్తను బాలాజీకాలనీ, వినాయకసాగర్ వద్దనున్న డంపింగ్ పాయింట్స్ కి తరలించే పని చేపట్టాలన్నారు. డంపింగ్ పాయింట్ల నుండి చెత్తను విడదీసి అక్కడ నుండి తూకివాకం చెత్త రిసైక్లింగ్ యూనిట్లకు తరలించాలని కమిషనర్ ఆదేశాలు జారీచేసారు.
ఇక పగలు పూట 210 మంది కార్మికులు, 110 మంది డ్రైవర్ల సహకారంతో తిరుపతిలోని 50 డివిజన్ల నుండి ఇంటింటికి వెల్లి తడి,పొడి చెత్తలను వేరు వేరుగా సేకరించి తూకివాకంకి పంపడం జరుగుతున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఆయా పనులపై నిరంతర పర్యవేక్షణ వుండాలన్నారు.
అదేవిధంగా రాత్రుల్లో ప్రధాన వాణిజ్య ప్రాంతాల్లో ఎంపిక చేయబడిన డస్ట్ బీన్ల వద్ద చేత్తను వేసేలా షాపుల వారికి చెప్పడం వలన, రాత్రుల్లో షాపులు మూసే సమయాల్లో వారు చెత్తను డస్ట్ బిన్లకు ఒక నిర్దేసిత సమయంలో తెచ్చేలాగా చూడాలన్నారు. స్వచ్చ సర్వేక్షన్లో దేశంలోనే తిరుపతి నగరం ప్రధమ స్థానంలో వుండేలాగా కృషి చేయాల్సిన భాధ్యత మనందరిపై వున్నదని కార్మికులనుద్దెసించి కమిషనర్ అనుపమ అంజలి అన్నారు.*