కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : ఎమ్మెల్యే కేపి వివేకానంద్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి 20వ వార్డు పూజిత ఎంక్లేవ్ కు చెందిన కాలనీ వాసులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని చింతల్ లోని కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీలో భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్ల అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీంతో సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే అందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వీరభద్ర రావు, ఏలమంద, బెనర్జీ, సతీష్ తదితరులు పాల్గొన్నారు.