SAKSHITHA NEWS

చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులకి లేబర్ ఇన్సూరెన్స్ ద్వారా అందించే నష్టపరిహార చెక్ లను అందజేసిన… కలెక్టర్

కలెక్టరేట్ సిబ్బంది బయోమెట్రిక్ హాజరు వివరాలను ఆకస్మికంగా తనిఖీ : కలెక్టర్ తేజస్

సాక్షిత న్యూస్ సూర్యపేట జిల్లా ప్రతినిధి: చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులకి లేబర్ ఇన్సూరెన్స్ ద్వారా అందించే నష్ట పరిహారం కుటుంబ సభ్యులకి ఆర్థిక భరోసాన్ని కల్గిస్తుందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.గురువారం జిల్లా కార్మిక కార్యాలయంలో కోదాడ మున్సిపాల్టీ, బాలాజీనగర్ కి చెందిన గంట అంజయ్య అనే లారీ డ్రైవర్ యాక్సిడెంట్ లో మరణించినందున వారికి లేబర్ ఇన్సూరెన్స్ ద్వారా గంట అంజయ్య భార్య రాజ్యం కి 2. 0 లక్షల చెక్ ని,కుమారుడు రామరాజు కి 1.10 లక్షల చెక్ ని, కుమార్తె మణికంఠ కి 3.0 లక్షల చెక్, మొత్తం 6.10 లక్షల రూపాయల విలువ గల 3 చెక్ లను కలెక్టర్ కుటుంబ సభ్యులకు అందజేశారు.తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల చట్టం పై పలు వివరాలను కలెక్టర్ అధికారులను అడిగినారు.

అంతకుముందు కలెక్టరేట్ లోని సిబ్బంది అందరు తప్పకుండా ఉదయం, సాయంత్రం బయోమెట్రిక్ ద్వారా హాజరు ని నమోదు చేసుకోవాలని,సిబ్బంది రోజు వారి హాజరు వివరాలను కలెక్టర్ పరిశీలించారు.అలాగే రైతు రుణ మాఫీ పై రైతుల సందేహాలు తీర్చుటకు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ని పరిశీలించి రోజు వారి కాల్స్ వివరాలను అడిగి తెలుసుకొని రైతులు ఫోన్ చేస్తే సంబంధిత మండల వ్యవసాయ అధికారికి సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమం లో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ జగదీష్ కుమార్, సందీప్, విజయలక్ష్మి,అర్షద్, శ్రీనివాస్, షరీఫ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS