డబుల్ బెడ్రూమ్ దరఖాస్తు గడువు పెంచండి కలెక్టర్
డబుల్ బెడ్రూం కొరకు కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని పేద,మధ్యతరగతి ప్రజలు 5 సంవత్సరాల నుండి కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న రు ఎట్టకేలకు జిల్లా కలెక్టర్ స్పందించి దరఖాస్తు చేసుకోవచ్చు అని ఆదేశాలు జారీచేశారు అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చింది దరఖాస్తు సమయం తక్కువ గా ఉండడంతో పాటు అక్షర జ్ఞానం లేని అసలైన పెదప్రజలకు ఈవిషయం ఆలస్యంగా తెల్సింది దీనితో సోమవారం దరఖాస్తు చేసుకునేందుకు మీసేవ ల వద్ద బారులు తీరారు,ఇబ్బందులు పడుతున్నారు వారి సమస్యలు పరిశీలించి కలెక్టర్ గారు గడువు పొడిగించాలని కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శి నాని యాదవ్ కోరారు
ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆలోచించాలి
డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి కుల,ఆదాయ, సర్టిఫికెట్ లు జత చేయాలని కోరారు ఈ సర్టిఫికెట్ లు ఒక్క రోజులో రావు ఈవిషయాన్ని ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ గుర్తించి 2 రోజులు గడువు పెంచి వారికి అండగా నిలవాలి మున్సిపల్ పరిధిలోని కౌన్సిలర్లు దరఖాస్తు విషయం పేద ప్రజలకు చెప్పలేదని విమర్శలు వచ్చిపడుతున్నాయి 2018 ఎన్నికల సమయంలో జైపాల్ యాదవ్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పారు అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు వచ్చేలా చూడాలి అందుకోసం అధికారుల తో మాట్లాడి గడువు పెంపు చేసి వారికి అండగా నిలవాలని కోరుతున్నాం లేకుంటే పార్టీ తరుపున పేదల కోసం ఆందోళన చేస్తామని నాని యాదవ్ హెచ్చరించారు