సమష్టిగా వినాయక చవితి ఉత్సవాలు – కార్యాచరణ సమీక్షలో ఎమ్మెల్యే భూమన
సాక్షిత, తిరుపతి బ్యూరో : హిందువులకు అత్యంత పవిత్రమైన వినాయక ఉత్సవాలను తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది సమిష్టిగా పనిచేసి ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి తెలిపారు.
స్థానిక కార్పోరేషన్ కార్యాలయంలో వినాయక చవితి ఉత్సవాల ఏర్పాట్ల పై నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళిశ్వర రెడ్డి తదితరులతో బుధవారం కార్యాచరణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
ఒక గొప్ప సందేశాన్ని ఆధ్యాత్మిక రాజధాని అయినటువంటి తిరుపతి నగరంలో ప్రజల భాగస్వామ్యంతో వినాయక ఉత్సవాలను నిర్వహించాలని సూచించారు. అదేవిధంగా కార్పోరేషన్ కార్యాలయం ఆవరణలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారని తెలిపారు. వినాయక నిమజ్జనోత్సవంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకొని పండుగను విజ యవంతంగా నిర్వహించే విధంగా ఆ వినాయకుడి ఆశీస్సులు ఉండాలని వేడుకుంటున్నారన్నారు. ఈ సమావేశంలో పలువురు ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
సమష్టిగా వినాయక చవితి ఉత్సవాలు – కార్యాచరణ సమీక్షలో ఎమ్మెల్యే భూమన
Related Posts
నాభిశిల (బొడ్డురాయి)కు పూజలు చేసిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు
SAKSHITHA NEWS నాభిశిల (బొడ్డురాయి)కు పూజలు చేసిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు . ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామ పంచాయతీ శివారు సూరాయపాలెంలో వేంచేసియున్న శ్రీశ్రీశ్రీ గంగానమ్మ అమ్మవారి గుడివద్ద నాభిశిల (బొడ్డురాయి) ప్రతిష్ట మహోత్సవం…
రైల్వే గేట్ వద్ద ట్రాఫిక్ ఇక్కట్లకు ఉపశమనం
SAKSHITHA NEWS కృష్ణాజిల్లా గుడివాడ రైల్వే గేట్ వద్ద ట్రాఫిక్ ఇక్కట్లకు ఉపశమనం ట్రాఫిక్ రద్దీపై చర్యలు చేపట్టిన:- ట్రాఫిక్ ఎస్ఐ జీ వి ప్రసాదరావు గుడివాడ పట్టణం కే.టి.ఆర్ కాలేజ్ గేట్ వద్ద ట్రైన్ వెళ్లే సమయంలో గేట్ కి…