సాక్షిత హైదరాబాద్:
వచ్చే నెల ఫిబ్రవరి 2వ తేదీన ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారని అందులో భాగంగా బహిరంగ సభను నిర్వహిస్తున్నామని, కనివిని ఎరుగని రీతిలో కాంగ్రెస్ బహిరంగ సభ ఉంటుందని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ పేర్కొన్నారు.
గాంధీభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్ పిసిసి చీఫ్ అయ్యాక ఇంద్రవెల్లి నుంచే తన ప్రచార కార్యక్రమం మొదలయ్యిందన్నారు.
ఇంద్రవెల్లి స్థూపం వద్ద స్మృతీ వనం కడుతామని సిఎం చెపారన్నారు.
కేస్లాపూర్ దేవాలయాన్ని సందర్శించనున్న సిఎం రేవంత్ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బోజ్జు మాట్లాడుతూ సిఎం రేవంత్ కేస్లాపూర్ దేవాలయాన్ని సందర్శిస్తారని, దీంతోపాటు ఇంద్రవెల్లిలో సిఎం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తారని ఆయన చెప్పారు.
ఇంద్రవెల్లి అమరుల కుటుంబాలను సిఎం కలుస్తారన్నారు. కడెం ప్రాజెక్టు నివేదికకు సిఎంకు అందచేశామని ఆయన తెలిపారు.గాంధీభవన్‌లో సభ ఏర్పాట్లపై సమీక్ష
ఈ విలేకరుల సమావేశానికి ముందు ఫిబ్రవరి లో 2వ తేదీన ఇంద్రవెళ్లిలో జరిగే సభ ఏర్పాట్లపై గాంధీ భవన్ లో సమీక్ష జరిగింది.
ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే ఎడ్మ బొజ్జు, మోత్కుపల్లి నర్సింలు, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నాయకులు పాల్గొన్నారు