SAKSHITHA NEWS

CM Revant Reddy, who is worried about women in the name of free bus

ఉచిత బస్సు పేరుతో మహిళల్ని ఘోరంగా మోసం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి

మహిళలకు సరైన సౌకర్యాలు కల్పించాలని డిపో మేనేజర్కి వినతి ………. బిజెపి

సాక్షిత వనపర్తి
రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని వారి ఓట్లతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం అని నమ్మి ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ప్రయాణం చేస్తున్నారని కానీ ఆర్టీసీ బస్సుల్లోనూ బస్టాండుల్లో సౌకర్యాలు కల్పించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలం చెందిందని పట్టణ బిజెపి పార్టీ ఆరోపిస్తూ వనపర్తి డిపో ను మంగళవారం బిజెపి పట్టణ అధ్యక్షుడు బచ్చు రాము ఆధ్వర్యంలో పార్టీ నాయకులు అసెంబ్లీ కన్వర్ శ్రీనివాస్ గౌడ్ బిజెపి పట్టణ ఉపాధ్యక్షులు కుమారస్వామి అధికార ప్రతినిధి పెద్దిరాజు లతో కలిసి సందర్శించి మహిళలకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు అనంతరం వనపర్తి డిపో మేనేజర్ కు వినతిపత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆరు పథకాలను ప్రకటించి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తున్నా ప్రకటించిన పథకాలలో ఒకటైన ఉచిత బస్సు ప్రయాణం మొదటగా మహిళల కోసం ప్రారంభించినప్పటికీ ఇంతవరకు కాలం చెల్లిన బస్సులతోనే పథకాన్ని కొనసాగిస్తున్నారని ఇప్పటివరకు ఒక బస్సును కూడా కొనలేదని కాలం చెల్లిన ఎలాంటి సౌకర్యాలు లేని బస్సుల్లోనే మహిళలు ప్రయాణం చేస్తూ అవస్థలు పడుతున్నారని ఆర్టీసీ బస్టాండులో మహిళలకు సరైన మూత్రస్థాలు మంచినీటి సౌకర్యాలు కూడా లేవని వనపర్తి ఆర్టీసీ షాపింగ్ కాంప్లెక్స్ ద్వారా లక్షల ఆదాయం వస్తున్న ప్రభుత్వము అధికారులు సౌకర్యాలు కల్పించడం లేదని వెంటనే స్పందించి మంచినీటి వసతి సులబ్ కాంప్లెక్స్ నిర్మించాలని కోరారు ఆర్టీసీ విద్యార్థిని విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు నడిపించాలని బస్సుల్లో మరిన్ని సీట్లను ఏర్పాటు చేయాలని పాలిచ్చే తల్లులకోసం బస్టాండ్ లో ప్రత్యేక క్యాబిన్ లు ఏర్పాటు చేయాలని బస్సుల బస్టాండ్ లో గంటల తరబడి మహిళలు వేచి ఉండాల్సి వస్తుందని వారు కూర్చోవడానికి కుర్చీలు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయాలని లేదంటే బిజెపి పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం జరుగుతుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి రాయన్న సాగర్ ఐటీ సెల్ కన్వీనర్ పట్టణ ఉపాధ్యక్షులు పీఎం రాము గోవిందు అనిల్ కుమార్ గౌడ్ జ్ఞానేశ్వర్ జంగాలగుట్ట శివ ఓం ప్రకాష్ చారి రాజానగరం రవి నాగవరం తండా శంకర్ నాయక్ బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 06 18 at 16.09.38 1

SAKSHITHA NEWS