CM KCR leadership by going to every house
మంచిర్యాల నియోజకవర్గం, మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 17 వార్డ్ లోని అశోక్ రోడ్,సీతారామ కాలనీ,లక్ష్మీకాంత నగర్,నగదేవత లైన్ రోడ్,చున్నాంబట్టి,వినాయక నగర్,సూర్య నగర్ లో పర్యటించిన మంచిర్యాల శాసనసభ్యలు నడిపెల్లి దివాకర్ రావు
ప్రతి ఇంటికి వెళ్లి సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. అలాగే స్థానిక సమస్యల గురించి అడిగి తెలుసుకొని పరిష్కరిస్తామని హామీచ్చారు.
.సంక్షేయ్మాభివృద్ధి విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, ఎవరు సలహాలు ఇచ్చినా సానుకూలంగా స్పందించి వాటిని అమలుపరిచే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య వార్డ్ నాయకులు,పట్టణ కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…