బీజేపీకి బీఆర్ఎస్ బీ-టీమ్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం కేసీఆర్

Spread the love

సోలాపూర్ :జూన్ 27
మహారాష్ట్ర టూర్‌లో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్, బీజేపీలకు బీ-టీమ్ కాదని స్పష్టం చేశారు. తాము ఎవరికి ఏ టీమ్, బీ టీమ్ కాదని మాది రైతులు, కార్మికులు, పేదల టీమ్ అని అన్నారు. చిన్న పార్టీని చూసుకుని జాతీయ పార్టీలు ఎందుకు జడుసుకుంటున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ అంటే భారత్ పరివర్తన్ పార్టీ అని.. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా బీఆర్ఎస్ మహారాష్ట్రలో పోటీ చేస్తుందని అన్నారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా మంగళవారం సోలాపూర్ జిల్లాలోని సర్కోలి గ్రామంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సోలాపూర్ జిల్లాకు చెందిన భగీరథ్‌ బాల్కే‌తో పాటు పలువురు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడిన కేసీఆర్.. తెలంగాణలో అమలు అవుతున్న పథకాలు మహారాష్ట్రలో ఎందుకు అమలు కావడం లేదన్నారు. మహారాష్ట్రలో పోటీ చేస్తామంటే ఎందుకు భయం అని ప్రశ్నించారు. రైతులంతా సంఘటితమై పోరాటం చేస్తే తప్పా రైతు సమస్యలు పరిష్కారం కావన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఎన్నేళ్లు పరిపాలించి ఎందుకు పని చేయలేకపోయాయని నిలదీశారు. తక్కువ సమయంలోనే తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతున్నదని, తెలంగాణలో సాధ్యమైన అభివృద్ధి మహారాష్ట్రలో ఎందుకు కావడం లేదన్నారు. పార్టీలో చేరిన భగీరథ్ బాల్కే ఎమ్మెల్యే అవుతారని ఆయన గెలిచాక మంత్రిగా కూడా అవుతారన్నారు…

Related Posts

You cannot copy content of this page