SAKSHITHA NEWS

WhatsApp Image 2023 08 07 at 6.09.26 PM

అధికారులను నిలదీయడానికి రాలేదు.. శభాష్‌ అని చెప్పడానికే వచ్చా: సీఎం జగన్‌

అల్లూరి సీతారామరాజు: కూనవరం వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రాంతాల్లో పర్యటించి, సహాయక చర్యలపై కూనవరం, వీఆర్‌పురం మండలాల బాధిత గ్రామాల ప్రజలతో మాట్లాడారు..

వరద బాధితులందరికీ సాయం అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని సీఎం జగన్‌ తెలిపారు. సహాయక చర్యల కోసం అధికారులకు తగిన సమయం ఇచ్చామని..నష్ట పరిహారం పక్కాగా అందేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. అధికారులు వారంపాటు గ్రామాల్లోనే ఉండి.. వరద బాధితులకు నిత్యవసరాలు అందించారని పేర్కొన్నారు.

డబ్బులు మిగుల్చుకోవాలనే ఆరాటం ప్రభుత్వానికి లేదు
వరదల వల్ల ఇళ్లు దెబ్బతిన్న వారికి రూ10 వేలు ఇవ్వాలని , ఇళ్లలోకి నీరు వచ్చినన వారికి రూ. 2 వేలు ఆర్థికసాయం ఇచ్చామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. వరద సాయం అందకుంటే ఇక్కడికి వచ్చి తనకు చెప్పాలని సూచించారు. అధికారులు నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వరద సాయం అందలేదని ఒక్క ఫిర్యాదు రాలేదని, ఏ ఒక్క బాధితుడు మిగిలిపోకుండా సాయం అందించారని తెలిపారు. ప్రతి ఒక్కరికి మంచి జరగాలన్నదే మా తాపత్రయమని.. డబ్బులు మిగుల్చుకోవాలనే ఆరాటం తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.


SAKSHITHA NEWS