ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటి పోలీస్ యాక్ట్ ఆంక్షలు

Spread the love

హోలీ సందర్భంగా ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటి పోలీస్ యాక్ట్ ఆంక్షలు

-పోలీస్ కమిషనర్ సునీల్ దత్

హోలీ సందర్భంగా ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ ఆంక్షలు విధించినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. హోలి రోజున రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన, బైక్‌లపై తిరుగుతూ ఇతరులకు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని పెర్కొన్నారు. వాహనాలపై గుంపులు.. గుంపులుగా ప్రయాణించవద్దని ఒకవేళ అలా ప్రయాణిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎవరికీ ఇబ్బంది కలగకుండా హోలీ వేడులను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని..అదేవిధంగా పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే రోడ్లపై పరిచయం లేని వ్యక్తులపై రంగులు జల్లడం, ప్రయాణీకులపైనా.. వాహనాలపై వెళ్లేవారిపైనా వారి అనుమతి లేకుండా బలవంతంగా రంగులు చల్లరాదనీ తెలిపారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం లేకుండా ఉండడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆదివారం (24-03-2024) ఉదయం 6:00 గంటల నుంచి మంగళవారం (26-03-2024) ఉదయం 6:00 గంటల వరకు అంక్షాలు అమలులో వుంటాయని తెలిపారు.

మద్యం దుకాణాలు, బార్లు బంద్‌

హోలీ పండగ నేపథ్యంలో మద్యం దుకాణాలు, కల్లు కాంపౌండ్‌లు, బార్‌ అటాచ్ టూ రెస్టారెంట్‌లు మూసివేయాలని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ నెల 25వ తేదీన హోలీ పండుగను పురస్కరించుకొని సోమవారం(25-03-2024)ఉదయం 6:00 గంటల నుంచి మంగళవారం (26-03-2024) ఉదయం 6:00 గంటల వరకు వైన్స్‌ షాపులు, బార్‌ అటాచ్ టూ రెస్టారెంట్‌లు, కల్లు దుకాణాలను 24 గంటల పాటు మూసివేయలని సూచించారు.

Related Posts

You cannot copy content of this page