కలెక్టర్ కార్యాలయ ముట్టడి ని జయప్రదం చేయాలి – సీఐటీయూ
చిట్యాల సాక్షిత ప్రతినిధి
ఐకెపి విఓఏ సమ్మె పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సోమవారం జరగబోయే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి లో వేలాది మంది ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు నారబోయిన శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం సమ్మె చేస్తున్న ఉద్యోగులను విభజించి పాలించాలని సూత్రాన్ని ఉపయోగిస్తున్నారని. సంవత్సర తరబడి పనిచేస్తున్న ఉద్యోగుల పట్ల మోస పూరితంగా సమ్మెను విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తుందని ఉద్యోగులు తమ శ్రమను దోచుకుంటున్న విధానాన్ని నిరసిస్తూ పోరాడి హక్కులు సాధించుకోవాలని సమ్మె చేయాలని పట్టుదలతో రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేయడం జరుగుతుందని ఇతర కార్మిక సంఘాలు ఉద్యోగులను సమ్మె చేయకుండా ప్రభుత్వానికి సానుకూలంగా ఉండటం వల్ల సాధించుకోవచ్చని సమ్మె చేస్తున్న ఉద్యోగులకు చెప్పి సమ్మెను విరమించాలని భ్రమలకు గురి చేస్తుంటే ఉద్యోగులంతా గత ఐదారు సంవత్సరాల నుంచి మోసపోయిన నష్టం చాలని.
ఏది ఏమైనా పోరాడి సాధించుకోవాలి ముక్కకంఠంతో సమ్మె చేస్తున్నారని న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించి సమ్మెను విరమించే ఆలోచన చేయాలని లేని పక్షంలో ఎలాంటి పోరాటాల కైనా ఉద్యోగులంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ పోరాటo తమ ఆకలి పోరాటంగా చావు రేవు తెలుసుకోవాలని ఉద్యోగులంతా భీష్పించున్నారని అన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు తేవడం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తున్నారని వారి శ్రమ ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తున్నా వారి రాజకీయ లబ్ధి కోసం ఉపయోగపడుతున్న ఐకెపి విఓఏ పట్ల ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని కోరారు. మహిళలని అన్ని రంగాలలో అభివృద్ధి చెందే విధంగా నిరంతరం మీరు చేస్తున్న ప్రయత్నం ప్రభుత్వం గుర్తించకపోవడం బాధాకరమని ఇప్పటికే అనేకసార్లు ఎమ్మెల్యేల చుట్టూ మంత్రుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయారని న్యాయం జరగట్లేదని తప్పని పరిస్థితులలో సమ్మెకు దిగవలసిన పరిస్థితి ఏర్పడిందని ఈ విషయం ప్రభుత్వం గుర్తించకపోవడం బాధాకరమని అన్నారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఏదుల లక్ష్మి, గుడిసె సువర్ణ, వడ్డగాని విజయ, గుడిసె పద్మ, అద్దెల ఉమా, ఉయ్యాల శోభ. సుమలత, వనజ కుమారి, సత్తమ్మ, రాధిక, శ్రీలత, బురుగు జ్యోతి తదితరులు పాల్గొన్నారు.