పెద్దపెల్లి జిల్లా :
గతంలో వివాదాస్పద చరిత్ర ఉన్నవారు పద్ధతి మార్చుకోవాలని.. లేకపోతే కఠిన చర్యలు తప్పవని సుల్తానాబాద్ సీఐ జగదీష్ హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో సిఐ జగదీష్ మాట్లాడుతూ.. రౌడీషీటర్స్, సస్పెక్ట్ షీటర్లకు నేర ప్రవృత్తి మానుకోవాలని సూచించారు. గతంలో నేర చరిత్ర ఉండి కేసులు నమోదయి జైలుకు వెళ్లివచ్చినవారు సత్ప్రవర్తనతో ఉండాలన్నారు. సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలో ఇటువంటి వారిపై పోలీసులు డేగ కన్ను ఉంటుందని వారి కదలికలపై నిఘా ఉంటుందన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు విజయేందర్, వెంకటకృష్ణ, రామకృష్ణ, శ్రీనివాస్ లు పాల్గొన్నారు….
పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు* సీఐ జగదీష్
Related Posts
మండుటెండలో మధ్యాహ్న భోజనం తింటున్న విద్యార్థులు
SAKSHITHA NEWS మండుటెండలో మధ్యాహ్న భోజనం తింటున్న విద్యార్థులు ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో 250 మందికిపైగా విద్యార్థులు, ప్రతిరోజూ మధ్యాహ్న భోజనం మండుటెండలో కూర్చొని తింటున్నారు. గత ప్రభుత్వ హయంలో మన ఊరు-మన…
తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రం
SAKSHITHA NEWS తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాసిల్ చౌరస్తా వద్ద నిరవదిక సమ్మే కొనసాగిస్తున్న సందర్భంగా వారిని కలిసి సంఘీభావం తెలియజేసిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ .ఈ సందర్భంగా…