SAKSHITHA NEWS

ఆటో డ్రైవర్స్ కి ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించిన సిఐ హరి కృష్ణ

కమలాపూర్ సాక్షిత

ఆటో డ్రైవర్స్ అన్ని రకాల వాహన పేపర్స్ అందుబాటులో ఉంచుకోవాలని కమలాపూర్ సిఐ ఈ, హరిక్రిష్ణ అన్నారు. కమలాపూర్ మండల కేంద్రం లోని కుల సంఘాల భవనం లో ఆటో డ్రైవర్స్ కి అవగాహణ కార్యక్రమం నిర్వహించిన సిఐ హారికృష్ణ మాట్లాడుతూ మండల కేంద్రం తో పాటు మండల పరిధిలోని వివిధ గ్రామాలల్లో ఉన్నటువంటి ఆటో డ్రైవర్స్ ప్రతీ ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ తప్పకుండా పాటించాలని అలాగే ఆటోలు కండీషన్ లో ఉండే విదంగా చూసుకోవాలని అలాగే డ్రైవర్స్ అందరికి లైసెన్స్ , ఆర్ సి పేపర్లు తప్పకుండా ఉండాలని, మరియు నంబర్ ప్లేట్ నంబర్ లేని వాహనాలు రోడ్ల పై తిరగారాదనీ అన్నారు. అలా ఎవరైనా నంబర్ ప్లేట్ లేకుండా రోడ్ల పై వాహనాలు నడిపితే అటువంటి ఆటోలను సీజ్ చేస్తామని అన్నారు.

ట్రాఫిక్ రూల్స్ కి విరుద్ధంగా ఆటోలు నడిపితే, మరియు మధ్యం సేవించి ఆటోలు నడిపి ప్యాసింజర్స్ కి విబ్బంది కలిగిస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుని పలు సెక్షన్ ల మీద కేసులు పెడతామని సిఐ హరి కృష్ణ అన్నారు. ఇ కార్యక్రమం లో జై హనుమాన్ ఆటో యూనియన్ అధ్యక్షులు కూనూరి రవి,ప్రధాన కార్యదర్శి అవునూరి తిరుపతి, ఉపాధ్యక్షులు, మౌటం లింగమూర్తి,కోశాధికారి జనగాని బిక్షపతి, మాజీ అధ్యక్షులు కిన్నెర వేణు సభ్యులు సారంగం, సర్వేశ్వర్, రాజు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS