SAKSHITHA NEWS

చింతలూరు శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు

— అధిక సంఖ్యలో 22 లక్షల 66 వేల 189 రూపాయలు ఆదాయం..

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం చింతలూరు శ్రీ నూకాంబికా అమ్మవారి జాతర మహోత్సవాలలో భాగంగా గత నెల 10వ తేదీ నుండి నేటి వరకు భక్తుల ద్వారా వచ్చిన ఆదాయంతో ఆలయ హుండీలు పూర్తిస్థాయిలో నిండి ఉన్న కారణముగా ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు అమ్మవారి హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని సోమవారం ఆలయ ప్రాంగణమునందు నిర్వహించారు.ఈ లెక్కింపు కార్యక్రమాన్ని రామచంద్రపురం దేవాదాయ శాఖ తనిఖీదారులు బాలాజీ రామ్ ప్రసాద్,ద్దేవస్థానం కార్యనిర్వాహణాధికారి వి.వీర్రాజు,దేవస్థానం చైర్మన్ ధర్మకర్త మండలి నూకపెయ్యి సూరిబాబు పర్యవేక్షణలో పెద్దపళ్ల బ్రాంచ్ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు సిబ్బంది సమక్షoలో హుండీలను తెరచి కమిటీ సభ్యులు, సేవా సమితి సభ్యుల సహకారంతో లెక్కించగా అమ్మవారి తీర్థ మహోత్సవాలకు గాను దేవస్థానము హుండీ ద్వారా మాత్రమే అధిక సంఖ్యలో 22 లక్షల 66 వేల 189 రూపాయలు హుండీ ఆదాయం వచ్చిందని ఆలయ ధర్మకర్తల మండలి నూకపెయ్యి సూరిబాబు ఆలయ కార్యనిర్వహణాధికారి వి. వీర్రాజు తెలిపారు.


SAKSHITHA NEWS