SAKSHITHA NEWS

పిల్లలను చట్ట ప్రకారం దత్తత తీసుకోవాలి
జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

పిల్లలను చట్ట ప్రకారం దత్తత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం కలెక్టర్, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ ఆధీనంలో ఉన్న ఇద్దరు పిల్లల దత్తత ప్రక్రియ ను కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో చేపట్టి, దరఖాస్తుచేసిన హైదరాబాద్, ఖమ్మం కు చెందిన దంపతులకు పిల్లలను అప్పగించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, దత్తత అనేది ఒక వరమని, అనాధలు అయినటువంటి పిల్లలను తీసుకుని వారికి మంచి భవిష్యత్తు ను ఇవ్వటమే కాకుండా ఆ పిల్లలకి కూడా మంచి తల్లిదండ్రులతో కూడిన కుటుంబంను ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయమని అన్నారు. దత్తత తీసుకున్న తల్లిదండ్రులకు న్యాయబద్ధమైన బిడ్డగా మారతారన్నారు. దత్తత పిల్లలకి ప్రభుత్వం ద్వారా చట్ట భద్రత కల్పించడం జరుగుతుందని, ఈ పిల్లలకి దత్తత ప్రక్రియ ద్వారా తల్లిదండ్రులుకి అందించడం వలన వారికి బంగారు భవిష్యత్తు లభిస్తుందని ఆయన తెలిపారు.

చట్ట విరుద్ధంగా పిల్లలను పెంచుకోవడం నేరమని, చట్ట విరుద్ధంగా పిల్లలను దత్తత ఇచ్చిన, తీసుకున్న వారికి 3 సంవత్సరాల కారాగార శిక్ష, లక్ష రూపాయలు జరిమానా విధించబడుతుందని కలెక్టర్ అన్నారు. ఏ ప్రయోజనాల కోసం అయినా ఒక బాలుడు/బాలికను అమ్మటం కానీ, కొనటం కానీ జరిగితే వారికి 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, దానితో పాటు లక్ష రూపాయల జరిమానా విధించబడుతుందని ఆయన తెలిపారు. చట్ట ప్రకారం మాత్రమే దత్తత తీసుకోవాలని,
శిశు గృహలో ఉన్న పిల్లల్ని చట్ట ప్రకారం దత్తతకి ఇవ్వనున్నట్లు, పిల్లలు దత్తత కావాలనుకున్న ఖమ్మం జిల్లాకు సంబంధించిన వారు మాత్రమే ఖమ్మం శిశు గృహ ద్వారా, బందుత్వ దత్తత కావాలనుకున్న వారు జిల్లా బాలల పరిరక్షణ విభాగంను సంప్రదించాలని ఆయన అన్నారు. దత్తత పట్ల ఆసక్తి గల వారు https://cara.wcd.gov.in/ నందు రిజిస్టర్ చేసుకోవాలని కలెక్టర్ అన్నారు.

WhatsApp Image 2024 08 21 at 17.43.54

SAKSHITHA NEWS