SAKSHITHA NEWS

ఎమ్మెల్యే నోముల భగత్

— నూతన గ్రామపంచాయతీ భవన శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే.

నాగార్జునసాగర్ (సాక్షిత ప్రతినిధి).

తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాల అభివృద్దే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్షమని నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ అన్నారు. మాడుగులపల్లి మండలం గ్యార కుంటపాలెం గ్రామంలో
20 లక్షల రూపాయలతో నూతన గ్రామపంచాయతీ భవనానికి ఎమ్మెల్యే భగత్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చొరవతో నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లిందుకు కృషి చేస్తానని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల చేతులలో నిర్లక్ష్యానికి గురైన అనేక గ్రామాలు బీఆర్ఎస్ పాలనలో క్రమక్రమంగా అభివృద్ధి చెందుతున్నాయి అన్నారు,


గ్రామాలను అభివృద్ధి చేయాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా మారిందని రైతాంగం కోసం సీఎం కేసీఆర్ ప్రాజెక్టులు కట్టి సాగునీరు, మంచినీరు,24 గంటల కరెంటు, పంటలకు పెట్టుబడులకు రైతుబంధు, రైతు మరణిస్తే వారికి రైతు బీమా ఇలాంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దలు, ఎంపీపీ పోకల శ్రీవిద్య నాగరాజు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చేకూరి హనుమంతరావు, డిసిసిబి జిల్లా డైరెక్టర్ విరిగినేని అంజయ్య, నిడమానూరు ఎంపీపీ సలహాదారుడు బొల్లం రవి, హాలియా మార్కెట్ చైర్మన్ జవాజీ వెంకటేశ్వర్లు, నిడమానూరు మార్కెట్ వైస్ చైర్మన్ మెరుగు రామలింగయ్య, స్థానిక సర్పంచ్ జొన్నలగడ్డ విజయ శ్రీనివాస్ రెడ్డి,ఎంపీటీసీ రజిత నరేందర్,మండల పార్టీ అధ్యక్షులు బాబాయ్ సెట్,మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ పిచ్చిరెడ్డి, జిల్లా కోఆప్షన్ నెంబర్ మోసిన్ అలీ,మార్కెట్ డైరెక్టర్ ఖాసీం, గ్రామ శాఖ అధ్యక్షులు కృపాకర్,నర్సింహా రెడ్డి,దేవస్థానం చైర్మన్ వెంకటరమణ, వివిధ హోదాలలో ఉన్న నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS