
గణతంత్ర దినోత్సవ వేడుకకు ముఖ్య అతిధులుగా రావాలి అని డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులను ఆహ్వానించిన నిజాంపేట్ డబల్ బెడ్ రూమ్ కాలనీ వాసులు…
నిజాంపేట్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ ని డిప్యూటీ మేయర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఈ నెల 26-01-2025 ఆదివారం రోజు నిజాంపేట్ లో డబల్ బెడ్ రూమ్ ఇల్లు కాలనీ వాసులు ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకలో ముఖ్య అతిధులుగా విచ్చేసి జాతీయ జెండాను ఆవిష్కరణకు రావాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ లో డబల్ బెడ్ రూమ్ ఇల్లు కాలనీ వాసులు సలీం,ఝాన్సీ, రవీందర్, సర్దార్, సహిన్ శర్మ, రాజు, రఫీ, నర్సింహా, చెన్నయ్య, బాషా, దమయంతి, లక్ష్మి, కధీర్, శివ, హైమద్, నాజర్, వెంకట్ రావు, తదితరులు పాల్గొన్నారు.
