
గ్రామ సభలో పాల్గొన్న జిల్లా ఎస్పీ
ప్రభుత్వ సంక్షేమ పథకాలకు లబ్దిదారుల ఎంపిక కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు కొనసాగుతున్న నేపథ్యంలో గద్వాల్ మండలం వీరాపురం గ్రామంలో నిర్వహించిన గ్రామ సభకు జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు, ఐపీఎస్ హాజరయ్యారు.
ఈ సందర్బంగా గ్రామానీకి సంబంధించిన సంక్షేమ పథకాల ఆర్హత జాబిత, తదితర వివరాలను పరిశీలించి ప్రజలతో మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా సంబంధిత అధికారులు కృషి చెయ్యడం జరుగుతుందని, ప్రజలకు ఎలాంటి విజ్ఞప్తిలు /అభ్యంతరాలు ఉన్న సంబంధిత వ్యవసాయ, రెవిన్యూ, గ్రామ పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని తెలియజేశారు . అనంతరం పోలీస్ బందోబస్తును పరిశీలించి ఏలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా వుండాలని పోలీస్ అధికారులకు సూచించారు. ఏదైన గ్రామం లో సమస్య తలెత్తితే వెంటనే హాజరు కావాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో గద్వాల్ రూరల్ ఎస్సై శ్రీకాంత్, వ్యవసాయ, రెవెన్యూ అధికారులు, పంచాయతీ కార్యదర్శి, పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయం
జోగుళాంబ గద్వాల్ జిల్లా
