చేవెళ్ల గడ్డపై రెండు లక్షల మెజార్టీతో గెలుస్తానని బిజెపి ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా శంకర్పల్లి మున్సిపల్ కేంద్రంలో గల పోలింగ్ బూత్ లను కొండ విశ్వేశ్వర్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి సందర్శించారు. అనంతరం కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ చేవెళ్ల ప్రజలంతా బిజెపికే ఓటు వేశారని నరేంద్ర మోడీని మరోసారి ప్రధాని చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ పార్టీ ఘన విజయం సాధిస్తుందన్నారు. చేవెళ్ల పార్లమెంట్ ప్రజలు విశ్వేశ్వర్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, మునిసిపల్ అధ్యక్షుడు సురేష్ యాదవ్, మున్సిపల్ ఇంచార్జ్ వాసుదేవ్ కన్నా, యూత్ నాయకులు దండు సంతోష్ కుమార్ అజయ్ గౌడ్, సతీష్ రెడ్డి, సాయి కిరణ్ రెడ్డి హేమంత్ రెడ్డి, అనిశెట్టి సురేష్, విశ్వనాథ్, దండు రామ్మోహన్, శ్రీదేవి ఉన్నారు.
రెండు లక్షల మెజార్టీతో గెలుస్తా: చేవెళ్ల బిజెపి ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
SAKSHITHA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
శాసనసభ సమావేశాలు విజయవంతంగా
SAKSHITHA NEWS శాసనసభ సమావేశాలు విజయవంతంగా ముగిసినందుకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని స్పీకర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈసందర్భంగా ముఖ్యమంత్రి ని శాలువా, పుష్పగుచ్ఛం తో సన్మానించిన స్పీకర్…