ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీలు

Spread the love

బెంగళూరు-భువనేశ్వర్‌ (18464) ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో వాల్తేర్‌ డీఆర్‌ఎం అనూప్‌కుమార్‌ సత్పతి బుధవారం తనిఖీలు చేశారు.

విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం రోడ్‌ వరకు అన్ని క్లాసుల్లో ప్రయాణించి ప్రయాణికుల టికెట్లు పరిశీలించారు.

సరైన టికెట్లు లేకుండా రిజర్వేషన్‌ కోచ్‌ల్లో ప్రయాణిస్తున్న 80 మందిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు.

వారి నుంచి రూ.31,500 అపరాధ రుసుంగా వసూలు చేశారు. ప్రయాణికులతో మాట్లాడి వారి సమస్యలు, సూచనలు స్వీకరించారు.

సరైన టికెట్‌ లేకుండా రిజర్వుడ్‌ కోచ్‌ల్లో ప్రయాణించడం, సరైన కారణం లేకుండా చెయిన్‌ లాగితే కఠిన చర్యలు తప్పవన్నారు.

కదులుతున్న రైలు ఎక్కడం, దిగడం చేయవద్దని సూచించారు.

అనంతరం శ్రీకాకుళం రోడ్‌ రైల్వేస్టేషన్‌ వద్ద నూతనంగా నిర్మించిన ఆర్పీఎఫ్‌ బ్యారక్‌ను డీఆర్‌ఎం ప్రారంభించారు.

సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ ఎ.కె.త్రిపాఠి, సీనియర్‌ డివిజనల్‌ సెక్యూరిటీ కమిషనర్‌ సీహెచ్‌ రఘువీర్‌, సీనియర్‌ డివిజనల్‌ సేఫ్టీ ఆఫీసర్‌ ప్రవీణ్‌ భాటి, సీనియర్‌ డివిజనల్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌ సీహెచ్‌ కామేశ్వరరావు, సీనియర్‌ డివిజనల్‌ ఇంజినీర్‌(ఈస్ట్‌) జిబన్‌ జ్యోతి సాహూ, టికెట్‌ తనిఖీ అధికారులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page