తిరుపతి నగరంలోని పోలీంగ్ స్టేషన్లు అన్నీ సక్రమంగా వున్నాయా లేవా అని పరిశీలించిన నివేదిక తయారు చేయాలని తిరుపతి ఓటర్ నమోదు అధికారి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ అన్నారు. తిరుపతి నియోజకవర్గం ఓటర్ల నమోదు అదనపు అధికారులతో, మునిసిపల్ రెవెన్యూ అధికారులు, ఆర్.ఐలతో తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో తిరుపతి నియోజకవర్గ ఓటర్ల నమోదు అధికారి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ చర్చించడం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ హరిత ఐఏఎస్ మాట్లాడుతూ తిరుపతి నగరంలో 265 పోలీంగ్ బూత్ లు 109 ప్రదేశాల్లో వున్న విషయాన్ని ప్రస్థావిస్తూ ప్రతి ఒక్క పోలీంగ్ బూత్ ను టీమ్ గా ఏర్పరిచిన అధికారులు స్వయంగా వెల్లి పరిశీలించి వెంటనే తనకు నివేదిక ఇవ్వాలని, తానే స్వయంగా ప్రతి ఒక్క పోలీంగ్ బూతును గురువారం నుండి పరిశీలించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే ఎన్నికల కమిషన్ లిస్టులో వున్న పోలీంగ్ బూతులు నిర్వహించే భవనాలు పటిష్టంగా వున్నాయా లేవా అని పరిశీలించాలని, ఆయా పోలీంగ్ బూతుల పేర్లు ఏమైనా మారి వున్నాయా అని నిర్ధారించుకోవాలని, ఓకవేళ మారి వుంటె వాటి వివరాలను జిల్లా ఎన్నికల అధికారి దృష్టికి వెంటనే తీసుకెల్లాలని సూచించారు.
అదేవిధంగా ఆయా పోలీంగ్ బూతులు ప్రభుత్వ భవనాల్లో వున్నాయా, ఏవైనా ప్రైవేట్ భవనాల్లో వున్నాయా అనే వివరాలు తీసుకోవాలన్నారు. ఓటర్ల సంఖ్య 1400 దాటిన పోలీంగ్ బూత్ లను గుర్తించి, దగ్గర్లోని వేరే పోలీంగ్ బూత్ కి మార్చేందుకు నివేదిక తయారు చేయాలన్నారు. తిరుపతి నియోజకవర్గంలోని ప్రతి ఒక్క పోలీంగ్ బూతును మరోసారి పరిశీలించి పూర్తి స్థాయిలో నివేదిక సమర్పించాలని తిరుపతి నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ ఆదేశాలు జారీ చేసారు. ఈ సమావేశంలో తిరుపతి నియోజకవర్గం ఓటర్ల నమోదు అదనపు అధికారులు డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళిశ్వర్ రెడ్డి, అర్బన్ ఎమ్మార్వో వెంకటరమణ, మునిసిపల్ కార్పొరేషన్ రెవెన్యూ అధికారులు కె.ఎల్.వర్మ, సేతుమాధవ్, డిటీ జీవన్, ఆర్.ఐలు పాల్గొన్నారు.