మౌలిక సదుపాయాల్లో శూన్యం

Spread the love

గణపవరం పంచాయితీలోని సమస్యలపై ప్రశ్నించిన జనసేన
పేరుకి ఊరు గొప్ప – అభివృద్ధిలో (మౌలిక సదుపాయాల్లో ) శూన్యం
బాపట్ల నియోజకవర్గంలో కర్లపాలెం మండలంకు(రాజకీయంగా) ఒక ప్రాధాన్యత. అదేవిధంగా కర్లపాలెం మండలానికి గణపవరం గ్రామం(ఆక్వా కల్చర్ లేదా ఆక్వా పంటలు) ఒక ప్రత్యేకత.
చెప్పుకుంటానికే కాని అక్కడ ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడని అంటున్న స్థానిక ప్రజలు….
అక్కడ ప్రజలు పడుతున్నబాధను చూడలేక స్వయంగా పరిశీలించిన స్థానిక మండల జనసేన పార్టీ నాయకులు…..
జనసేన పార్టీ మండల అధ్యక్షులు గొట్టిపాటి శ్రీకృష్ణ మాట్లాడుతూ:-
గణపవరం గ్రామంలోని సమస్యలు:-
1) రహదారి:-
కర్లపాలెం మండలంలోని గణపవరం రహదారి మీద కట్టవాద,నర్రవారిపాలెం & పెదపులుగువారిపాలెం ప్రజలు, వాహనదారులు ప్రయాణిస్తారు…..
ఒక తేలికపాటి వర్షం పడినా రహదారి వర్షంతో మునిగిపోతుంది… ఎందుకంటే పేరుకే రహదారి – మొత్తం (రహదారి మీద) గుంటలు
పలుమార్లు అధికారులకు, స్ధానిక అధికార పార్టీ నాయకులకు మా గొడుని విన్నవించుకుంటే
✓ ఒక సంవత్సరం పుట్టమట్టి పోశారు.మరో సంవత్సరం ఇసుక, ఇప్పుడేమో(మూడు రోజుల క్రితం)కాంక్రీట్ దిమ్మెలను రోడ్కు అడ్డంగా పడవేసారు…..
ముఖ్య గమనిక:-
వీటిని (కాంక్రీట్ దిమ్మేలను) వేసినందుకు సుమారు 15000/- రూపాయలు ఖర్చని పంచాయితీ లెక్కలకింద వేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం…..
2) పాత ఇనుప విద్యుత్ స్థంభాలు
ఈ పంచాయితీలో సుమారు 40 సంవత్సరాల క్రితం వేసిన ఇనుప విద్యుత్ స్థంభాలను ఇప్పటికీ మార్చకుండా అలానే ఉంచారు. మేము పలుమార్లు అర్జీలు ప్రభుత్వ అధికారులకు ఇచ్చిన ఎటువంటి మార్పు లేదు. అదే ప్రైవేట్ వారికీ(రియల్ ఎస్టేట్, పలు వ్యాపారం వారికీ) కొన్ని గంటల వ్యవధిలో విద్యుత్ శాఖ వారు స్పందిస్తున్నారు….
ఈ విషయం మీద జనసేన పార్టీ తరుపున కొన్ని రోజులు క్రితం మేము కర్లపాలెం విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ధర్నా చేస్తే Ae ఒక వారం రోజులలో మరుస్తాను అన్నారు కాని ఎటువంటి మార్పు లేకపోవటం హాస్యాస్పదం……
3) మైక్రో వాటర్ ప్లాంట్ కి వాడిన నిధులు నిరుపయోగం:-
స్థానిక ఎమ్మెల్యే కోన రఘుపతి ఎంతో ఘనంగా ప్రారంభించిన మైక్రో వాటర్ ప్లాంట్ నిరుపయోగంగా ఉంది…..
4) రహదారికి ఇరువైపులా పిచ్చి మొక్కలే:-
గణపవరం – కేశవపురికి వెళ్ళే రహదారికి సుమారు 1 కిలో మీటర్ పొడవునా రోడ్ కి ఇరువైపులా పిచ్చి మొక్కలున్నాయని కేశవపురి ప్రజలు పంచాయితీ అధికారులను అడగగా మా దగ్గర నిధులు లేవని సమాధానం చెప్పారు…..
5) స్మశాన వాటిక :-
కేశవపురి ప్రజలలో ఎవరైనా చనిపోతే మోకాళ్ళ లోతు బురదలో వెళ్లి మేము (గిరిజనులకు)దహన సంస్కారణలు చెయ్యాలంటే ఎంత ఇబ్బందిగా ఉందని వాపోయారు…..
తక్షణమే జిల్లా కలెక్టర్ & ప్రభుత్వ అధికారులు అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని పరిష్కరించాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాము……..
ఈ కార్యక్రమంలో కర్లపాలెం మండల అధ్యక్షులు గొట్టిపాటి శ్రీకృష్ణ, ఉపాధ్యక్షులు చిలకల సురేంద్రబాబు,సెక్రెటరీ షేక్ సత్తార్ & స్థానిక ప్రజలు పాల్గొన్నారు..

Related Posts

You cannot copy content of this page