SAKSHITHA NEWS

ప్రభుత్వాలు మారుతున్న ఆడబిడ్డ ఆడపిల్లలపై ఆగని ఆగాయిత్యలు –ఏబీవీపీ శంకర్ పల్లి నగర కార్యదర్శి నితిన్

సాక్షిత శంకర్‌పల్లి : ప్రభుత్యం మారిన విద్యార్థులపై ఆగని అరాచకాలు.
వార్డెన్ పై వెంటనే సస్పెండ్ చేయాలి.
నిందితులను కటినంగా శిక్షించాలి.
ABVP శంకర్ పల్లి నగర కార్యదర్శి నితిన్
శంకర్‌పల్లి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ శంకర్ పల్లీ నగర శాఖ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి నితిన్ కుమార్ ఉపాధ్యక్షుడు శివ యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు శనివారం రోజు రాత్రి బోనగిరిలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం సిగ్గుచేటని బీద కుటుంబాలకు చెందినటువంటి విద్యార్థులు నాణ్యమైన విద్య భోజనం రక్షణ దొరుకుతుందని కోటి ఆశలతో హాస్టల్లో అడుగుపెడితే వాళ్ల శవాలు బయటికి రావడం చాలా దురదృష్టకరమని ఏ టీంలో తెలంగాణ రాష్ట్రంలో ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు సమాజం పైన అవగాహన లేని పదోవ తరగతి విద్యార్థుల మృతిపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి.

విద్యార్థుల వసతి గుర్హలోకి ఆటో డ్రైవర్లు ఎలా ప్రవేశిస్తారు. ఆటో డ్రవర్లను వార్డెన్ వసతి గృహాల్లో ఎలా అనుమతించరు. పదే పదే పిర్యాదు చేసిన వార్డెన్ ఎందుకు చర్యలు తీసుకోలేదు. వసతి గృహాల్లో. ఆ భద్రత విపల్యం స్పష్టంగా కనిపిస్తుంది. దీనిపై ప్రభుత్యం ఎందుకు స్పందించడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల అమరుల ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కానీ ఈరోజు ఏ ప్రభుత్వం ఏర్పడిన కూడా అదే విద్యార్థులకు అన్యాయం జరుగుతుందంటే ఎంతవరకు న్యాయమని విద్యావ్యవస్థనే గాలికి వదిలేయడం కాకుండా విద్యార్థుల పైన అత్యాచారాలు జరుగుతున్న కూడా పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు.

రోడ్ మీద ఫుడ్ స్టాల్ తొలగిస్తే వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి ఇద్దరు పదో తరగతి విద్యార్థులు మరణిస్తే స్పందన లేదు. ఈ ఘటనను ABVP తీవ్రంగా ఖండిస్తుంది. మరణించిన విద్యార్ధులకు కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలి. ప్రభుత్యం ఇకనైనా స్పందించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ABVP తరుపున హెచ్చరిస్తున్నాము. గత ప్రభుత్యం మంత్రులని,ఎమ్మెల్యేను ఎలా అయితే అడుకునామో ప్రభుత్యం విద్యార్ధులకు అన్యాయం చేస్తే ఈ ప్రభుత్యం మంత్రులకు, ఎమ్మెల్యేకు కూడా ఆ పరిస్తితి తపదు అన్ని హెచ్చరిస్తూ. ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపి నిందితులపై కటినంగా చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల వసతి గృహాల్లో కటిన భద్రత కల్పించాలి అన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో నగర ఉప అధ్యక్షులు శివ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 02 06 at 3.06.05 PM

SAKSHITHA NEWS