పశ్చిమ ప్రకాశం పై చంద్రబాబు ప్రత్యేక దృష్టి.

Spread the love

పశ్చిమ ప్రకాశం పై చంద్రబాబు ప్రత్యేక దృష్టి.

ఈ నెల 19, 20, 21 తేదీల్లో విస్తృత పర్యటన.

యర్రగొండపాలెం.

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ ప్రకాశంలో పార్టీ అభివృద్ధిపైన ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఆయన మార్కాపురం డివిజన్ లో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు ఈ నెల 19 వ తేది గిద్దలూరు, 20 న మార్కాపురం, 21 వ తేది యర్రగొండపాలెం నియోజకవర్గాలలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ మేరకు మాజీమంత్రి,ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చం నాయుడు పశ్చిమ ప్రకాశం లోని మూడు నియోజకవర్గాలకు చెందిన పార్టీ ఇంచార్జ్ లతో శనివారం మాట్లాడి చంద్రబాబు పర్యటనను ఖరారు చేసినట్టు తెలిసింది.
ఈ నెల 20 న చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా అదే రోజు ఆయన మార్కాపురం లో పర్యటించనుండడం విశేషం.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page