Chandrababu Naidu who broke Jagan’s regime
ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైకాపా ఇంటికెళ్లడం ఖాయం
జగన్ పాలనపై విరుచుకుపడిన చంద్రబాబునాయుడు
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నుంచి పొందూరు వరకు సాగిన
చంద్రబాబు రోడ్‌షోలో అడుగడుగునా ప్రజలు,బ్రహ్మరధం పట్టారు.గజమాలతో చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ దారిపొడవునా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. శ్రీకాకుళం జిల్లా ముఖద్వారం వద్ద తెలుగుదేశం పార్టీ మాజీమంత్రి,కిమిడి కళావెంకటరావు ఆధ్వర్యంలో వేలాది మంది కార్యకర్తలు,అభిమానుతో బాబుకు స్వాగతం పలికారు. అక్కడ నుంచి నేరుగా చిలకపాలెం మీదుగా రోడ్డుషో చేసుకుంటూ రాజాంలో బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు.
అభిమాన నేతను చూసేందుకు మహిళలు,యువకులు,ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావటంతో కాన్వాయిలో బహిరంగ సభకు వెళ్లేందుకు చాలా సమయం పట్టింది. ఈ రోడ్డు పొడవునా ప్రజలు సమస్యను విన్నవించికుంటూ వినతిపత్రం అందజేశారు. అనంతరం చంద్రబాబు రాజాం బహిరంగ సభలో మాట్లాడుతూ…
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైకాపా ఇంటికి వెళ్లడం ఖాయమని అన్నారు.రాష్ట్రాన్ని జగన్మోహన్రెడ్డి నాశనం చేస్తున్నాడని ,ఉత్తరాంధ్రపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని బాబు ఆరోపించారు. ఈ క్లిష్టమైన సమయంలో రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. చెత్త మీద పన్ను వేసిన ఘనత వైకాపా ప్రభుత్వానికే చెందుతుందని ఎద్దేవాచేశారు.
రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగినట్లు కేంద్రం చెబుతోందన్నారు.ఒక్క నీటిపారుదల ప్రాజెక్టు పూర్తిచేశారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒక పాత్రికేయుడు కష్టపడి పొందూరు మండల కేంద్రంలో ఇల్లు నిర్మించుకుంటే వైకాపా నాయకులకు డబ్బులు ఇవ్వనందుకు కూల్చివేయడం తగునా అని మండిపడ్డారు. ఈ సందర్భంగా శాసనసభ స్పీకర్ పై చంద్రబాబు మండిపడ్డారు. నేను పెట్టిన భిక్షతోనే ఈ రోజు స్పీకర్ పదవిలో ఉన్నాడు. స్పీకర్ పదవికి అర్హుడా అని ప్రశ్నించారు.