SAKSHITHA NEWS

సాక్షిత : హనుమాన్ జయంతి పర్వదినంను పురస్కరించుకుని చందానగర్ డివిజన్ పరిధిలోని వేమన రెడ్డి కాలనీ లో చందానగర్ డివిజన్ బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన హనుమాన్ శోభ యాత్ర ను మియాపూర్ ఏసీపీ నర్సింహ రావు తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసి, జెండా ఊపి ర్యాలీ ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ప్రజలందరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని,
ఎక్కడ శ్రీరాముడు కొలువై ఉంటాడో,
ఎక్కడ శ్రీరామ నామం వినిపిస్తుందో.. అక్కడ హనుమంతుడు ఉంటాడు. ఆయనను మించిన భక్తుడు లేడంటూ శ్రీ రామచంద్రుడు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న భాగ్యశాలి హనుమంతుడు అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.అదేవిధంగా రామాయణానికి
ఓ నిండుదనాన్ని తీసుకు వచ్చాడు. సుగ్రీవుడిలో కదలిక తీసుకు వచ్చి అతని సైన్యాన్ని ముందుకు నడిపించడంలోనూ …
లంకలో ఉన్న సీతమ్మవారి ఆచూకీ తెలుసుకోవడంలోను …
వారధి నిర్మించడంలోను … యుద్ధరంగాన లక్ష్మణుడు మూర్చ పోయినప్పుడు ‘సంజీవిని’ పర్వతాన్ని పెకిలించి తీసుకు రావడంలోను హనుమంతుడు కీలకమైన పాత్రను పోషించాడు. అందుకే హనుమంతుడులేని రామాయణాన్ని అస్సలు ఊహించలేం అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు
హనుమాన్ శోభాయాత్ర లో పాల్గొన్న వారికి ముస్లిం సోదరులు మజ్జిగను అందించి మత సామరస్యం ను ప్రదర్శించడం గొప్ప విషయం అని యాత్ర లో పాల్గొని,విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ,బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


SAKSHITHA NEWS