సాక్షిత : చందానగర్ డివిజన్ పరిధిలోని గౌతమి నగర్ లో గల పలు సమస్యలు మరియు చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల కై GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులు మరియు కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి తో కలిసి పాదయాత్ర చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ గౌతమి నగర్ కాలనీ లో నెలకొన్న రోడ్ల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానని, కాలనీ లో అసంపూర్తిగా మిగిలిపోయిన పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడం జరిగినది , కాలనీ లో రోడ్ల ను త్వరలోనే పునరుద్దరిస్తామని , వీధి దీపాల వంటి సమస్యల ను త్వరలోనే పరిష్కరిస్తానని, సీసీ రోడ్లు, విధి దీపాల ఏర్పాటు కు కృషి చేస్తానని ,త్వరలోనే పనులు జరుగుతున్న సమయంలో మరోసారి కాలనీ లలో పర్యటిస్తానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిదంగా కాలనీల లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, డ్రైనేజీ, రోడ్లు, మంచి నీరు,విద్యత్ దీపాలు వంటి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా కాలనీ వాసులు అందరూ కలిసి కాలనీ అభివృద్ధి లో భాగస్వాములు కావాలని, కాలనీ వాసులందరి కృషి తో ఆదర్శవంతమైన కాలనీలు గా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ఏ చిన్న సమస్య ఐన తన దృష్టికి గాని ,కార్పొరేటర్ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని, ఎల్లవేళల అందుబాటులో ఉంటానని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు EE శ్రీకాంతిని ,DE స్రవంతి , AE శివప్రసాద్ మరియు మాజీ కౌన్సిలర్ రవీందర్ రావు ,చందానగర్ డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి తెరాస నాయకులు ఓ. వెంకటేష్, పులిపాటి నాగరాజు, నరేందర్ బల్లా , హరీష్ రెడ్డి, దాస్, కార్తీక్ గౌడ్, అమిత్ దుబే , ప్రవీణ్ ,రాజశేఖర్ రెడ్డి, సందీప్, యశ్వంత్,శంకర్ రావు, అశోక్ ,వరలక్ష్మి రెడ్డి స్థానికులు తదితరులు పాల్గొన్నారు.