SAKSHITHA NEWS

సాక్షిత : చందానగర్ డివిజన్ పరిధిలోని చందానగర్ లో విజేత సూపర్ మార్కెట్ ఎదురుగా ప్రధాన రహదారి పై నూతనంగా నిర్మిస్తున్న పాదచారుల వంతెన (ఫూట్ ఓవర్ బ్రిడ్జి ) నిర్మాణ పనులను GHMC అధికారులు ,R&B అధికారులు మరియు కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి తో కలిసి పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం ,రోడ్డు దాటే పాదచారుల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రత్యక్షంగా ప్రాంతాలను గుర్తించి అక్కడ నిర్మించాల్సిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి లకు ప్రాంతాలను నిర్ణయించడమైనది అని ,నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలను, ప్రజలు ఎక్కువగా తిరిగే ప్రాంతాలను, ప్రమాదాలు జరిగిన ప్రాంతాలను పరిగణలోకి తీసుకొని ఫుట్ ఓవర్ బ్రిడ్జి లను నిర్మించడం జరుగుతుంది అని, అందులో భాగంగా పనుల పురోగతులను పరిశీలించడం జరిగినది అని, ఫుట్ ఓవర్ బ్రిడ్జి అవసరం ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ నిర్మాణం చేపట్టేవిధంగా కృషి చేస్తున్నామని ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ తెలియచేసారు.ఈ పాదచారుల వంతెన నిర్మాణముల వలన రోడ్డు దాటే వృద్దులకు,పిల్లలకు,పాదచారులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు వీలుగా నిర్మాణం చేపట్టడం జరుగుతుంది అని,అందరికి అనువైన,సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తున్నామని, పుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాలను ప్రకటనలకు మాత్రమే కాకుండా ప్రజలకు ఉపయోగపడేలా,ప్రమాద రహిత ప్రాంతలుగా తీర్చిదిద్దడమే ముఖ్య లక్ష్యం అని ,ట్రాఫిక్ సమస్య ఉన్న చోట మాత్రమే నిర్మాణము చేపట్టేలా చూడాలని,ట్రాఫిక్ రహిత ,ప్రమాద రహితంగా తీర్చిదిద్దాలని,పుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని,నాణ్యత విషయంలో రాజీ పడకుండా నాణ్యత ప్రమాణాలతో నిర్మించాలని ప్రభుత్వ విప్ గాంధీ అధికారులకు పలు సలహాలు సూచనలు ఇచ్చారు. అదేవిధంగా కరోనా విపత్కర పరిస్థితుల్లో అభివృద్ధికి ఎటువంటి లోటు లేకుండా ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం మౌలిక వసతులు కల్పించడం లో ప్రత్యేక శ్రద్ద కనబరుస్తోంది అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు EE శ్రీకాంతిని ,DE స్రవంతి , AE శివప్రసాద్ , R & B EE ధర్మారెడ్డి, DE రామకృష్ణ , మరియు మాజీ కౌన్సిలర్ రవీందర్ రావు ,చందానగర్ డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి తెరాస నాయకులు ఓ. వెంకటేష్, పులిపాటి నాగరాజు, నరేందర్ బల్లా , హరీష్ రెడ్డి, దాస్, కార్తీక్ గౌడ్, అమిత్ దుబే , ప్రవీణ్ ,రాజశేఖర్ రెడ్డి,శంకర్ రావు, అశోక్ ,వరలక్ష్మి రెడ్డి స్థానికులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS