SAKSHITHA NEWS

కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చలో ఢిల్లీ – జిట్ట నగేష్

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)

కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏప్రిల్ 5వ తేదీ న జరిపే చలో డిల్లీ కార్యక్రమాన్ని జయప్రధం చేయాలని కెవిపియస్ రాష్ట్ర కమిటీ సభ్యులు జిట్ట నగేష్, సిఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు నారబోయ్న శ్రీనివాస్ లు కోరారు. చిట్యాలలో స్థానిక మేకల లింగయ్య స్మారక భవనం లో శనివారం నాడు సిఐటీయు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగిన కార్మిక, కర్షక సదస్సు కు హాజరై మాట్లాడారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కార్మిక చట్టాలను సవరణలు చేయడం విడ్డూరంగా ఉన్నదని విమర్శించారు. రైతు చట్టాలను పూర్తి స్థాయి లో రద్దు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. చలో డిల్లీ కార్యక్రమాన్ని బలపరుస్తూ ఏప్రిల్ 5న మండల కేంద్రంలో జరిపే నిరసన కార్యక్రమాలు విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఐతరాజు నర్సింహ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అరూరి శీను, వివిధ ప్రజా సంఘాల నాయకులు వడ్డేపల్లి ఎల్లయ్య, ఏళ్ళు మారయ్య, కడగంచి నర్సింహ, సిలివేరు అంజయ్య, ఏనుగు వెంకట్ రెడ్డి, పాల లక్ష్మయ్య,బాకి అండాలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS