SAKSHITHA NEWS

కల్వకుర్తి పట్టణంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర నిఖిత హత్య ను నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈ నెల 16 న ఛలో అచ్చంపేట కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లు ను నిఖిత న్యాయ జేఏసీ ఆధ్వర్యంలో విడుదల చేశారు ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ
నాగిల్ల నిఖితది మమ్ముటికి హత్యనే

ఉమ్మడి జిల్లా కు చెందిన ఒక మంత్రి ,,ఉమ్మడి నల్గొండ జిల్లా కు చెందిన మరో మంత్రి నిందితులను రక్షిస్తున్నారు దానికి స్థానిక ప్రజా ప్రతినిధి కూడా తోడయ్యారు

నికిత మృతి మీద రాజకీయ నీడ వీడకుంటే రాజకీయంగానే బుద్ధి చెప్తాం

దళితులను శిక్షించడంలో ముందుండే పోలీసులు దళితులకు జరిగిన అన్యాయం మీద అన్యాయంగానే ప్రవర్తిస్తున్నారు

తేది.06.03.2023 నాడు మన్నమార్ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిఖిత అవే 7వ తరగతి విద్యార్థివి అనుమానస్పద స్థితిలో ఉరివేసుకొని చనిపోవడం జరిగింది. గురుకుల పాఠశాల అంటేనే నీత్యం టీచర్ల పర్యవేక్షణలో ఉండే వ్యవస్థ. కాని నిఖిత మరణించిన సమయానికి విధులు నిర్వహించాల్సిన ఏఒక్క టీచరు కూడా అక్కడ లేకపోవడం మరియు ప్రిన్సిపాల్లో పాటు ఎవ్వరు కూడా సంఘటన జరిగిన వెంటనే పోలీసులకు లేదా తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా గంటల తరబడి జాప్యం చేయడం జరిగింది. ఉరివేసుకున్న విధానం కూడా అనుమానస్పదంగా ఉన్నది. అక్కడికి వచ్చిన తల్లిదండ్రులకు కూడా తమ బిడ్డ శవం దగ్గర స్వేచ్ఛను ఇవ్వకుండా బందించడం జరిగింది, ఈపరిణామాలన్నింటిని లెక్క చేయకుండా ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు రాజకీయ పార్టీలు నిరసన తెలియజేస్తున్నా పెడచెవిన పెట్టకుండా పోలీసులు అదేరోజు అర్థరాత్రి 3.00 గంటల సమయంలో పోస్టుమార్టం చేసి శవానికి దహన సంస్కారాలు నిర్వహించడం జరిగింది.

ఈ పరిణామాలన్నింటి క్రమంలో 13-03-2023 వాడు MRPS అధినేత సామాజిక పరివర్తకులుమందకృష్ణ మాదిగ | వేరుగా మన్ననర్ సాంఘిక సంక్షేమ పాఠశాలను సందర్శించి నిఖిత ఉరివేసుకున్న తరగతి గదివి క్షుణ్ణంగా పరిశీలించి అనేక అనుమానాలను పోలీసుల ముందే లేవవెత్తడం జరిగింది. తరగతి గదిలో ఉన్న ఫ్యాన్ కూడా ఎలాంటి బెండు కాకుండా ఉండటం, టేబులు మీది నుండి విద్యార్థిని ఎత్తున పరిశీలించడం, విద్యార్థినికి చెప్పులు లేక పోవడం, విద్యార్థిని ఉరివేసుకున్న చున్ని ఆమెకు సంబంధించింది. ” కాక పోవడం, ఉరివేసుకున్న టేబుల్ దగ్గర అతిపెద్ద పాద ముద్రలు ఉండటం, అర్థరాత్రి సమయంలో పోస్టుమార్టం నిర్వహించడం లాంటి ఎన్నో అనుమానస్పద సందేహాలను పోలీసులను అడిగి పరిశీలించిన తదనంతరం అక్కడికి వచ్చిన వివిధ ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు రాజకీయ పార్టీలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిఖిత మృతదేహానికి కచ్చితంగా రీ పోస్టుమార్టం నిర్వహించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ సంఘటనకు నిరసనగా 16-03-2023 వాడు అచ్చంపేట బంద్ కు పిలుపు నివ్వడం జరిగింది.

ఈ బంద్ కు ప్రజల నుండి వచ్చిన స్పందనను గమనించిన ప్రభుత్వం విళిత మృతదేహానికి 17-03-2023 నా రి-పోస్టుమార్టం నిర్వహించారు. ” ఏ సందేహాలను మనం వెలిబుచ్చామో రి పోస్టుమార్టంలో మన సందేహాలకు బలం చేకూరే విధంగా నిఖిత మృతదేహానికి ఎడమ కవతపై ఎడమచెవి భాగాన రంద్రం, ఎడమ భుజానికి, కుడికాలు మోకాలు కింద బలమైన గాయాలున్న విషయాన్ని డాక్టర్ల సమక్షంలో నిఖిత కుటుంబ సభ్యులు చూడటం జరిగింది. ఈ నేపథ్యంలోనే మన డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం కొనసాగుతుంది.

డిమాండ్లు:

  1. నిఖిత మృతి కేసుమ హత్య కేసుగా నమోదు చేయాలి.
  2. విఖిత మృతి కేసును పిట్టింగ్ బడ్డ విచారణ జరిపించాలి.
  3. మొదటి సారి విబంధనలను ఉల్లంఘించడంతో పాటు, అసంపూర్తిగా పోస్టుమార్టం చేసిన డాక్టరు సస్పెండ్ చేయాలి.
  4. నిఖిత కుటుంబ సభ్యులకు 50లక్షల ఎక్స్ గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి.
  5. కేసును తప్పుదోవ పట్టిస్తున్న పోలీసులను సస్పెండ్ చేయాలి.
  6. హత్యచేసిన నిందితులను అరెస్టు చేయాలి.

కావున నిఖిత మృతికి కారకులైన దోషులకు శిక్ష పడేవరకు మన నిరసన కార్యక్రమలు చేపడుతాం అని తేది: 16.04.2023 ఛలో అచ్చంపేట పిలుపు నివ్వడం జరిగింది. కావున ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలి రావాలని ఈ కార్యక్రమంలో అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, కులసంఘాలు, వ్యాపార, వాణిజ్య, సంఘాల నాయకులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేసి నిఖిత కుటుంబానికి జరిగిన అన్యాయం మరోకుటుంబానికి బరగకుండా మనమందరం కలిసి కట్టుగా పోరాటం చేయాలని కోరుతూ.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MRPS అధివేత మందకృష్ణ మాదిగ హాజరవుతున్నారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో MSP ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇంఛార్జి టైగర్ జంగయ్య మాదిగ,MRPS సీనియర్ నాయకులు మబ్బు సాయిలు మాదిగ, సీనియర్ నాయకులు వీరస్వామి మాదిగ ,BSP సీనియర్ నాయకులు..మల్లేష్..jac కల్వకుర్తి తాలుకా చైర్మన్ కానుగుల జంగయ్య ,తెలంగణ JAC నాయకులు సధనందం గౌడ్, MRPS రంగారెడ్డి జిల్లా కో కన్వీనర్ పోతుగంటి కృష్ణ మాదిగ , MRPS రంగారెడ్డి జిల్లా కో కన్వీనర్ తుడుం చంద్ర
కిరణ్ మాదిగ, msp నాయకులు కృష్ణ మాదిగ..శేఖర్ మాదిగ msf మండల ఇంఛార్జి దేవరాజు మాదిగ ,రామకృష్ణ గురుమూర్తి , తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS