SAKSHITHA NEWS

హైదరాబాద్:ఏప్రిల్ 19
ఈ సంవత్సరం ఏప్రిల్ 19న వచ్చే ఏకాదశిని… కామద ఏకాదశి అని, దమన ఏకాదశి అని జరుపుకో నున్నారు.

ఇది చైత్ర మాసం శుక్ల పక్షం రోజున వస్తోంది. ఈ రోజున ఉదయాన్నే స్నానమాచ రించి పరిశుభ్రమైన దుస్తు లు ధరించి లక్ష్మీనారాయణు లను పూజించాలి.

వ్రతం ఆచరించడం వల్ల సకల దుఃఖాలు నశించి సుఖసంతోషాలు కలుగు తాయని ప్రతీతి.ఈ ఏడాది కామద ఏకాదశి ఏప్రిల్ 19న జరుపుకుంటారు.

ఏకాదశి తిథి ఏప్రిల్ 18న సాయంత్రం 5.31 గంటలకు ప్రారంభమై, ఏప్రిల్ 19 రాత్రి 8.04 గంటల వరకు కొనసాగుతుంది. ఉదయ తిథి ప్రకారం 19 వ తేదిన వ్రతం ఆచరించాల్సి ఉంటుంది.

20 ఏప్రిల్ రోజున ఉదయం 05.50 నుంచి 08.26 మధ్య వ్రతాన్ని ముగిం చాలి. ఈ రోజున పితృ దేవతలకు నైవేద్యం, కోరికలు ఈడేరేందుకు, ఆర్థిక లాభం నెరవేరేందుకు వేర్వేరు రీతుల ఆరాధనలు చేయడం జరుగుతుంది.

నియమనిబంధనలు తెలుసుకుని వాటిని ఆచరించాలి. మనం తెలియక చేసే పాపాలన్నీ ఈ ఒక్క ఏకాదశి రోజు మనం ఆచరించే వ్రతం, ఉపవాసం వలన పోతా యని పురాణాలు చెబు తున్నాయి

WhatsApp Image 2024 04 19 at 10.51.14 AM

SAKSHITHA NEWS