central government is supporting the farmers in all ways
రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటోంది కేంద్ర ప్రభుత్వమే
- బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు మంగళవారం రోజు ఏర్పాటు చేసిన రైతు ధర్నా లో రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి రెడ్డి, జిల్లా అధ్యక్షులు కన్నం యుగదిశ్వర్ లతో కలసి బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి పాల్గొన్నారు.
అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి ‘ఫసల్ భీమా పథకం’ తెలంగాణ రాష్టంలో కెసిఆర్ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.
ధరణి పోర్టల్ ను ప్రక్షాన చేయకుండా రైతులను మానసిక క్షోభకు గురిచేస్తుందని, వడ్ల కొనుగోలు కేంద్రంలో ఇస్తున్న హమాలీ పైసలు రైతులకు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందని అసహనం వ్యక్తం చేశారు. కెసిఆర్ ప్రభుత్వం లక్ష రూపాయల రైతు రుణ మాఫీ వెంటనే అమలు చేయాలని, వడ్ల కొనుగోలు కేంద్రాలను తగిన సంఖ్యలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తేమ, తరుగు పేరిట రైతులను మోసం చేస్తే ఉరుకునే ప్రసక్తే లేదని, వడ్లు కొని వారాలు గడిచినా ఇంతవరకు రైతుల ఖాతా లలో డబ్బులు జమ కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో అన్ని మండలాల అధ్యక్షులు, జిల్లా నాయకులు, కిసాన్ మోర్చా, మహిళ మోర్చా, యువ మోర్చా నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.