మల్కాజిగిరి పార్లమెంట్ బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ 60వ పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన జన్మదిన వేడుక కార్యక్రమాల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు పాల్గొని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముందుగా ఈటల రాజేందర్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, భారీ కేక్ ను కట్ చేశారు. ఈటల రాజేందర్ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని, మల్కాజిగిరి ఎంపీ గెలుపొంది కేంద్ర మంత్రి కావాలని ఆకాంక్షించారు. ఈటల రాజేందర్ ని గెలిపించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు కలిసి పని చేయాలని సూచించారు. అనంతరం నియోజకవర్గం వ్యాప్తంగా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, డివిజన్, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ఘనంగా ఈటల జన్మదిన వేడుకలు… భారీ కేక్ కట్టింగ్
Related Posts
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…
మున్సిపాలిటీలకు వచ్చే ఆదాయాలను పక్కాగా నిర్వహించి,అభివృద్ధి
SAKSHITHA NEWS మున్సిపాలిటీలకు వచ్చే ఆదాయాలను పక్కాగా నిర్వహించి,అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా గద్వాల, ఐజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీలకు మంజూరైన నిధులు, వాటి ద్వారా చేపట్టిన అభివృద్ధి…