పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు
సాక్షిత హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 774 పోలీస్ స్టేషన్లు ఉన్నాయని, వీటిలో ఇప్పటికే 399 స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నది. మరో 103 స్టేషన్లలో సీసీ కెమెరాల ఏర్పాటుకు అనుమతి మంజూరైందని తెలిపింది.
సీసీ కెమెరాలు లేక కొన్ని పీఎస్‌లలో ప్రజల పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ అందిన లేఖను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం సుమోటో పిల్‌గా స్వీకరించి విచారణ జరుపగా, ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదన వినిపించారు. సదరు పిల్‌పై విచారణ ముగిస్తున్నట్టు ప్రకటించింది….