నేరం జరగలేదని చంద్రబాబు నిరూపించగలరా?: సజ్జల

Spread the love

నేరం జరగలేదని చంద్రబాబు నిరూపించగలరా?: సజ్జల

తాడేపల్లి: చంద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు..

నేరం జరగలేదని చంద్రబాబు నిరూపించగలరా? అని ప్రశ్నించారు. ఊరు, పేరు లేకుండా అగ్రిమెంట్‌ తయారు చేశారని మండిపడ్డారు. సీమెన్స్‌ సంస్థ సైతం మాకు సంబంధం లేదని చెప్పిందని తెలిపారు.రూ. 300 కోట్లకుపైగా ప్రజాధనాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేశారు ఆగ్రహం వ్యక్తం చేశారు..

స్కిల్‌ స్కాంలో చంద్రబాబును సాక్ష్యాధారాలతోనే అరెస్ట్‌ చేశారు. అన్ని ఆధారలతోనే సీఐడీ చంద్రబాబును అరెస్ట్‌ చేసింది. ఫేక్‌ ఇన్వాయిస్‌తో నిధులు పక్కదారి పట్టించారు. అన్ని వేళ్లు చంద్రబాబు వైపే చూపిస్తున్నాయి. ఈడీ కూడా నలుగురిని అరెస్ట్‌ చేసింది. రూ. 300 కోట్లు జేబులో వేసుకోవడానికే స్కిల్‌ కుట్ర. ఈ స్కామ్‌కు సూత్రధారి, లబ్ధిదారు చంద్రబాబే. చంద్రబాబు అరెస్టులో కక్షసాధింపు ఎక్కడ ఉంది..

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page