కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ఆదాయం లెక్కింపు…
ఐరాల మండలం, కాణిపాక వరసిద్ధి వినాయక స్వామికి హుండీ ద్వారా రూ. 1, 19, 57, 630 లభించినట్లు పాలక మండలి చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేశు తెలిపారు.
బుధవారం ఆలయ ఆస్థాన మండపంలో స్వామి కానుకలను చైర్మన్, ఈవో పర్యవేక్షణలో ఆలయ సిబ్బంది లెక్కించారు.
ఈ లెక్కింపులో 23 గ్రాముల బంగారు,
1 కేజీ 120 గ్రాముల వెండి,
535 యూఏఎన్ సిఏ,
15 ఆస్ట్రేలియా,
33 సింగపూర్ డాలర్లు,
105 మలేసియా రింగిట్స్,
5 ఇంగ్లాండు పౌండ్స్ లభించాయి.
గో సంరక్షణ హుండీ ద్వారా రూ. 6080 లభిం చినట్లు వారు తెలిపారు.
ఆలయానికి ఈ ఆదాయం పూర్తిగా 16 రోజులలో లభించినట్లు వారు తెలిపారు.
ఈ లెక్కింపులో డీఈవో వెంకట సుబ్బయ్య, ఏఈవోలు ఎస్వీ కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, హేమమాలిని, హరి, హరిమాధవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.