SAKSHITHA NEWS

మంత్రి ఆనం ను మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి శ్రేణులు బైరెడ్డి , చండ్ర,గౌసా,చినహజి

…..

కనిగిరి సాక్షిత :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మాత్యులు ఆనం రామనారాయణరెడ్డిని నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో పామూరు సింగిల్ విండో మాజీ అధ్యక్షులు బైరెడ్డి జయరామిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చంతో సత్కరించారు. ఈ సందర్భంగా బైరెడ్డి మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం మరియు పర్యాటక క్షేత్రమైన భైరవకోనను సందర్శించి భైరవకోనను అభివృద్ధి చేయవలసిందిగా, భైరవకోనలో అసంపూర్తిగా నిలిచిపోయిన అభివృద్ధిని పున ప్రారంభించాలని, మంత్రివర్యులు ఆనంను విజ్ఞప్తి చేశారు. ఉదయగిరి నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు చండ్ర ఉమామహేశ్వరరావు, టిడిపి నాయకులు షేక్ హాజీ గౌస్, అష్రఫ్ రైస్ ట్రేడర్స్ అధినేత చిన హాజీ మలన్ మంత్రి ఆనం ను సత్కరించిన వారిలో ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app