Buses should be driven following traffic rules: Traffic Inspector Naresh Kumar
ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ బస్సులను నడపాలి: ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్
ఆర్టీసీ డ్రైవర్లకు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించిన మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్
సాక్షిత : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మంచిర్యాల ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ బస్ డ్రైవర్లకు ట్రాఫిక్ రూల్స్ పై మరియు ప్రయాణికుల భద్రత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో తగు సూచనలతో అవగాహన కార్యకమం నిర్వహించనైనది.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ మాట్లాడుతూ… డ్రైవర్స్ డిఫెన్స్ డ్రైవింగ్ చేయాలని రోడ్ కి ఇరువైపులా ఉండే బైలైన్స్ ఉన్న ప్రాంతం లో నిర్ణత స్పీడ్ లో డ్రైవ్ చేయాలి, పశువులు, జంతువులు ఉన్న ప్రాంతం లో కూడా నెమ్మదిగా డ్రైవ్ చేయాలని తెలపడం జరిగింది. ప్రయాణం సమయం లో ముందు వాహనానికి సుమారు 50ft దూరం ను మైంటైన్ చేస్తూ డ్రైవ్ చేయాలన్నారు.
పలు చోట్ల ట్రాఫిక్ ను అంతరాయం కల్గిస్తున్న కొంతమంది డ్రైవర్ల బాధ్యతారాహిత్యాన్ని గుర్తు చేశారు. పద్దతి ప్రకారం వాహనాలు నడిపితే అన్ని వాహనాలు సకాలంలో గమ్యస్ధానాలను చేరుకుంటాయని తెలుసుకోవాలన్నారు.
కూడళ్ల వద్ద స్టాపింగ్ కు అనుమతి ఉండదన్నారు. సూచించిన ప్రాంతాల్లోనే బస్సులను నిలపాలన్నారు. డ్రైవర్లు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సంయమనం పాటించాలని, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయరాదని, నిర్దేశించిన వేగంతో మాత్రమే బస్ ను నడపాలని, పట్టణ ప్రాంతాల్లో బస్ స్టాండ్ల వద్ద మాత్రమే నిలపాలని, ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగించే విధంగా పార్కింగ్ చేయరాదని ,
ఓవర్ టేకింగ్ చేస్తున్నప్పుడు అన్ని జాగ్రత్త లు తీసుకోవాలని, పట్టణ ప్రాంతాల్లో ఓవర్ టేకింగ్ చేయకుండా నడపాలని, కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ కచ్చితంగా పాటించాలని సూచించారు.
ఈ అవగాహన కార్యక్రమంలో మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ K. నరేశ్ కుమార్ తో పాటు మంచిర్యాల ఆర్టీసీ DM రవీంద్రనాథ్ , ఆర్టీసీ డ్రైవర్లు మరియు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.