-అడిగిన వెంటనే నిధులు మంజూరుచేసిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.
-ఎమ్మెల్యే కు ధన్యవాదములు తెలిపిన వట్టిమర్తి గ్రామ ప్రజలు.
సాక్షిత ప్రతినిధి ( నకిరేకల్ )
చిట్యాల మాండలం వట్టిమర్తి గ్రామానికి యేండ్లు గడుస్తున్నా బస్సు షెల్టర్ నిర్మాణం జరుగలేదు, ప్రజలు బస్సు కోసం ఎండలో రోడ్డు పై నిలబడి బస్సు కోసం వేచి చూసే వాళ్ళు, ఇదే విషయం ఎన్ని సార్లు జి ఎం ర్ అధికారులకు దృష్టికి తీసుకుపోయిన ఫలితం శూన్యం.ఇట్టి విషయం నకిరేకల్ ఎంఎల్ఏ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి నిధులు మంజూరు చేయటం జరిగింది. గ్రామ పాలక వర్గం, మాజీ ఎంఎల్ ఏ, గ్రామ ప్రధమ పౌరుడు అయినటువంటి నర్రా రాఘవరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి బస్సు షెల్టర్ కోసం భూమి పూజ పనులు ప్రారంభించారు.ఇట్టి కార్యక్రమం లో మిల్లర్ అస్సోసియేషన్ ఉపాధ్యక్షుడు పోలె పెద్దయ్య,గ్రామశాఖ అధ్యక్షుడు నర్రా శ్రీకాంత్ రెడ్డి,మండలం ఎస్సి సెల్ అధ్యక్షుడు మేడి రాజు మార్కెట్ కమిటీ డైరెక్టర్ పర్నె నరేందర్ రెడ్డి,సీనియర్ నాయకులు, ఏళ్ళ సత్యనారాయణ రెడ్డీ,లెంకలా సతీరెడ్డి , మేడి కృష్ణయ్య నరేందరెడ్డి,ముత్యం శెట్టి,మేడి నర్సింహా,మాజీ సర్పంచ్ మేడబోయిన లింగయ్య,పల్లపు పెంటయ్య బిక్షం రెడ్డి, జాలా ప్రకాష్, మధు,జలా శ్రీశైలం,మేడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.