కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుతో ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రజల దృష్టి మరల్చేందుకు బీఆర్ఎస్ నాయకులు రైతాంగం పై ముసలి కన్నీరు కారుస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొంగరి రవి అన్నారు . కూడావెళ్లి వాగులోకి సాగునీళ్లను విడుదల చేయడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పోన్నం ప్రభాకర్, కొండా సురేఖ , నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఅర్ఎస్ ప్రభుత్వం అదికరంలో ఉండగా అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు పదివేలు ఇస్తామని హామీ ఇచ్చి తప్పించుకున్నారని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుల పేరుతో వేల కోట్లు దోచుకోని. నిజమైన రైతులకు అందించాల్సిన సబ్సిడీ ట్రాక్టర్లను గులాబి గులాములకు మంజూరు చేసిన బీఅర్ఎస్ నాయకులు రైతు సంక్షేమం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు . దుబ్బాక నియోజకవర్గం రైతుల సమస్యలను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ల దృష్టికి నియోజకవర్గ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి తీసుకెళ్లడంతో సంబంధిత శాఖ ఉన్నతాధికారులను మంత్రులు ఆదేశించడంతో నియోజకవర్గంలో ఉనికి కోల్పోతున్న బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు.
రైతులపై బీఆర్ఎస్ పార్టీ మొసలి కన్నీరు. — మండల అధ్యక్షుడు కొంగరి రవి
Related Posts
మరోసారి పెద్ద ఎత్తున గంజాయి చాక్లెట్ గుట్టు రట్టు చేసిన సైబరాబాద్ SOT బాలానగర్ టీం
SAKSHITHA NEWS మరోసారి పెద్ద ఎత్తున గంజాయి చాక్లెట్ గుట్టు రట్టు చేసిన సైబరాబాద్ SOT బాలానగర్ టీం విశ్వసనీయ సమాచారం మేరకు SOT బాలానగర్ టీమ్ మరియు జగత్గిరిగుట్ట పోలీసులు సంయుక్తంగా జగత్గిరిగుట్ట రింగ్ బస్తీలో కిరాణా దుకాణంపై దాడి…
అసెంబ్లీ ముందుకు 4 కీలక బిల్లులు
SAKSHITHA NEWS అసెంబ్లీ ముందుకు 4 కీలక బిల్లులు హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం రోజు వాడి వేడిగా సాగాయి అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి అయినప్పటికీ ఈ సమావేశంలోనే శాసనసభ 3 ప్రభుత్వ బిల్లులకు ఆమోదముద్ర…