SAKSHITHA NEWS

కృష్ణానది జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం టిఆర్ఎస్ పార్టీ చేపట్టిన చలో నల్లగొండ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ కామెంట్స్….

జోగుళాంబ ప్రతినిది,నల్గొండ:-

నా కట్టే కాలేవరకు… తెలంగాణకు అన్యాయం జరిగితే చాతనైనా కాకపోయినా… పులిలాగా లేచి కొట్లాడుతారు

నేను ఉన్నంతవరకు తెలంగాణకు అన్యాయం జరగనివ్వను

అసెంబ్లీలో పెట్టిన తీర్మానం కూడా సక్కగా లేదు… అందులో తాగునీళ్లు, సాగునీరు పెట్టారు కానీ విద్యుత్ గురించి ప్రస్తావించలేదు…

కాంగ్రెస్ పార్టీకి కావలసింది పైసలు పైరవీలే…

మన అందరం పిడికిలి బిగించాలి అప్పుడే మన హక్కులను కాపాడుకోగలుగుతాం

కృష్ణ ట్రిబ్యునల్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అప్రమత్తంగా లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా కొట్లాడాలి

ఇదే మాట చెప్పేందుకు ఇంత దూరం నల్లగొండకు వచ్చిన

కొత్త గవర్నమెంట్ వస్తే గత ప్రభుత్వం కంటే నాలుగు మంచి పనులు చేసి ప్రజల మెప్పు పొందాలని చూడాలి

కానీ కేవలం కేసీఆర్ అన్న తిట్టడమే పనిగా పెట్టుకున్నారు

లేని పోనీ బదనం చేసి… ప్రజల హక్కులను గాలికి వదిలేసి… కెసిఆర్ దుర్భాషలాడితే పెద్ద వాళ్ళు అవుతారా

ఎవరికి అధికారం శాశ్వతం కాదు తెలంగాణ ప్రజల హక్కులు శాశ్వతం తెలంగాణ ప్రజల వాటాలు శాశ్వతం తెలంగాణ బతుకులు శాశ్వతం

తెలంగాణను కొట్లాడి తెచ్చినం కాబట్టి వీటన్నింటి కోసం కొట్లాడుతూనే ఉంటాం

ఈరోజు పెట్టింది రాజకీయ సభ కాదు ఉద్యమ సభ

కృష్ణానది జలాలు లేక నలగొండ జిల్లా బిడ్డల నడుములు ఫ్లోరైడ్ తో వంగిపోయినయ్

ఆరోజు ఉన్న పార్టీలు నాయకులు ఏనాడు పట్టించుకోలేదు

మా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నల్లగొండలో క్లోరోసిస్ బాధ లేకుండా చేసింది

భగీరథ నీళ్లు వచ్చినంక ఫ్లోరైడ్ బాధలు పోయినాయి

ఏనాడూ ఏ నాయకుడు కూడా పట్టించుకోలేదు

ఈ సభ పెట్టింది కొంతమంది సన్నాసులు తెలివి లేకుండా తమకు వ్యతిరేకం అనుకుంటున్నారు

ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసి పడుకుంటే… మనల్ని మనం కాపాడుకోకుండా ఎవరు కూడా మనని కాపాడేందుకు రారు

ఎన్నికల అప్పుడే మీకోసం వస్తారు తర్వాత ఎవరు రారు

గతంలో కూడా ఎన్నికల కోసమే ప్రజల దగ్గరికి వచ్చిరు తర్వాత రాలేరు

ఇది చిల్లర మల్లెల రాజకీయ సభ కాదు

నీళ్లు పంచాలనుకుంటున్న బ్రిజిష్ ట్రిబ్యునల్ కి కానీ మన నీళ్లు ఎత్తుక పోవాలనుకుంటున్న శక్తులకు ఈ నల్లగొండ సభ ఒక హెచ్చరిక కావాలి

ఖమ్మం మహబూబ్నగర్ నల్లగొండ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల జీవన్మరణ సమస్య ఇది

మీ అందరి దీవెనలతోని 10 సంవత్సరాలు పరిపాలన చేసిన

ఒక్క నిమిషం కరెంటు పోకుండా కరెంటు ఇచ్చినం… ఇంటింటికి నీళ్లు ఇచ్చినం

అంతకుముందు నల్లగొండకు లేని నీళ్లు నల్లగొండకు వచ్చినై లక్షలాది ఎకరాల పంట పండుతుంది

ఇవన్నీ చేయాలంటే దమ్ము కావాలి తెలంగాణకు మంచి చేయాలన్న ఆరాటం కావాలి నా గడ్డ నా ప్రజలు అన్న ఆలోచన కావాలి

ఆనాడు జలసాధన ఉద్యమం కోసం 45 రోజులపాటు ప్రజల్లో తిరిగి చైతన్యం చేసినం

ఆనాడు పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితం ఏమి లేకపాయ అని పాట రాసి ఏడ్చినం

దిండి ఎత్తిపోతల పథకం పూర్తి కావస్తున్నది… పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు పూర్తికానున్నాయి

కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని కేసులు వేసినా కేంద్రంతో కొట్లాడుతూ ఈ ప్రాజెక్టులన్ని పూర్తి చేసేందుకు ప్రయత్నం చేసినం

ఢిల్లీలోని మోడీ ప్రభుత్వానికి ఎన్నిసార్లు లేఖలు రాసిన నీళ్ల పంపిణీ చేయమని కోరిన ఇయ్యలేదు

సుప్రీంకోర్టులో కేసు వేసినం… కేసు వెనక్కి తీసుకుంటే ట్రిబ్యునల్ వేస్తామని చెప్పడంతోని వెనక్కి తీసుకున్నాం

వారం రోజులపాటు లోక్సభను స్తంభింప చేసి కొట్లాడినం…. ఎన్నికల ముందు ట్రిబ్యునల్ కి ఇచ్చింది కేంద్రం

రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్న మన రాష్ట్ర ప్రజల అవసరాలను రాష్ట్రానికి ఉన్న పరిస్థితులు కరువును చెప్పి… న్యాయమైన వాటా కోసం కొట్లాడాలి

పాలిచ్చే బర్రెను అమ్మేసి దున్నపోతును తెచ్చుకున్నారు… ఏమైతుందో మూడు నెలల నుంచి చూస్తున్నాం

మూడు నెలల్లోనే ఈ ప్రభుత్వం కె ఆర్ ఎం బి బోర్డుకి కృష్ణాజిల్లాలను అప్పజెప్పింది

నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రమే మంచి ఉంది అంటున్నాడు

మరి లక్షల మంది కోట్ల మంది ఎందుకు ఉద్యమం చేసిర్రు ఇదే జిల్లాకు చెందిన శ్రీకాంత్ ఆచారి ఎందుకు ఆత్మ త్యాగం చేసిండు

తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న నష్టం పైన హరీష్ రావు గర్జించిండు

మా పార్టీ ఒత్తిడితోని ఆగమేఘాల మీద చలో నల్లగొండ సభ నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది

మేము అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే కరెంటు మొత్తం ఇచ్చిన

మేము 9 సంవత్సరాలు ఇచ్చిన కరెంటు అధికారం పోగానే కరెంటు కట్క వేసినట్లు పోతున్నది

చేతగాని దద్దమ్మలు… చేతగాని చావటలు ఉంటే కరెంటు ఇట్లాగే పోతుంది

అందుకే ఎక్కడికక్కడ మా కరెంటు ఎక్కడ పోయిందని ప్రజలు ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి

దామరచర్లలో పెండింగ్లో ఉన్న కొన్ని పనులు చేస్తే నాలుగు వేల మెగావాట్ల కరెంటు వస్తది

గతంలో కన్నా 5600 మెగావాట్ల కరెంటు ఎక్కువగా ఉన్న కరెంటు ఎందుకు ఇస్తలేరు

ప్రజలను ఎందుకు తిప్పలు పెడుతున్నారు

ప్రజలను కరెంటుకు… నీళ్లకు …. మంచినీళ్లకు ఇబ్బందులకు గురి చేస్తే ఎక్కడికి అక్కడ నిలబెడతాం

ప్రజలు మాకు ప్రతిపక్షాన్ని నిలదీసే బాధ్యత ఇచ్చిన

ఏ విధంగా అయితే మా ప్రభుత్వం ఇచ్చిందో అదే విధంగా కరెంటు కోతలు లేకుండా ఇవ్వాలి

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అసెంబ్లీలో జనరేటర్ పెట్టి మరి నడిపిస్తున్నారు

నాయకులు ప్రెస్ మీట్ మాట్లాడుతుంటే ఒక్క సమావేశంలో ఏడుసార్లు కరెంటు పోతుంది

మీకు నడపలేక చేతకాక… మందిని తిట్టి నడపాలి అనుకుంటున్నారా

దీన్ని నడవనీయం… వెంటాడుతం…

రైతుబంధు ఇచ్చేదానికి కూడా చాతనవ్వడం లేదా… ఇంత దద్దమ్మల…

రైతుబంధు ఇయకున్నా పర్వాలేదు కానీ… రైతుల్ని పట్టుకుని చెప్పుతో కొట్టాలంటారు

ఎన్ని గుండెలు రా మీకు… పంటలు వండించే రైతులకు కూడా చెప్పులు ఉంటాయి… జాగ్రత్త బిడ్డ

రైతుల చెప్పులు బందోబస్తుగా ఉంటాయి… రైతుల చెప్పులు గట్టిగా ఉంటాయి… వాళ్ల చెప్పు దెబ్బతో మూడు పళ్ళు ఊడిపోతాయి…

రైతులను తిట్టడం మర్యాద గౌరవమా…

నీకు చేతకాకుంటే తర్వాత రైతుబంధు ఇస్తామని చెప్పాలే కానీ అడిగితే చెప్పుతో కొడతారా

నల్లగొండలో అడుగుపెట్టని ఏమంటారు… తెలంగాణ తెచ్చిన కేసీఆర్ని తిరగనియ్యరా… ఏం చేస్తారు చంపేస్తారా… కెసిఆర్ ను చంపి మీరు ఉంటారా…

దమ్ముంటే పాలమూరు ఎత్తిపోతల… సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయాలి …. గురుకులాలు పెట్టాలి.. కరెంటు సరఫరా మంచిగా ఇవ్వాలి… మంచినీళ్లు సరఫరా ఇవ్వాలి… ఇవన్నీ పట్టించుకోకుండా బలాదూర్గా తిరుగుతారా

మిమ్మల్ని తిరగనీయం… నిలదీస్తాం…

మేడిగడ్డ పోతాం బొందల గడ్డ పోతాం… పోయి ఏం పీకుతారు…

దమ్ముంటే ఈరోజు కూడా ప్రాణహితలో ఉన్న నీళ్లను ఎత్తిపోయాలి

అసెంబ్లీ తర్వాత మేము కూడా మేడిగడ్డ పోతాం… కాంగ్రెస్ పార్టీ చరిత్ర ప్రజలకు చెబుతాం…

కాలేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక ఆట బొమ్మ కాదు…

గతంలో నాగార్జునసాగర్, మూసి ప్రాజెక్టు, కాడెం ప్రాజెక్టులకు ఇబ్బంది రాలేదా

ఇబ్బందులు వస్తే సరి చేయాలి…

అధికారం ఎవరికి శాశ్వతం కాదు… మేము మళ్లీ రెండు మూడింతల బలంతో అధికారంలోకి వస్తాము…

మేము కూడా ఇలాగే మాట్లాడాలా… నదుల మీద నీటిమీద ఈ ప్రభుత్వానికి అవగాహన లేదు

అసెంబ్లీ తీర్మానంతో ఈ సమస్య అయిపోదు… కృష్ణ నది జలాల్లో మొత్తం నీటి వాటాలు తేలేదాకా ఈ సమస్య అయిపోదు…

న్యాయమైన ప్రజల హక్కుల కోసం వాటాల కోసం పోరాటం చేయాలి…

చావు నోట్లోకి పోయి తెలంగాణ తీసుకు వచ్చిన నాకు ఈ రాష్ట్ర సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఆరాటం ఉంటది

WhatsApp Image 2024 02 13 at 6.04.06 PM

SAKSHITHA NEWS