చిట్యాల (సాక్షిత ప్రతినిధి)
నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోకల దేవదాస్ అన్నారు. చిట్యాల పట్టణంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేవదాసు మాట్లాడుతూ ఆర్థికవేత్త, న్యాయనిపుణుడు, బహుభాషావేత్త, తత్వశాస్త్ర పండితుడు , సంఘ సంస్కర్త, భారతదేశంలో అంటరానితనం సామాజిక అసమానత నిర్మూలనకు తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ అని, నవభారత రాజ్యాంగ నిర్మాత ,అణగారిన వర్గాల పక్షాణ నిలిచిన మహనీయుడు అని అన్నారు, భారత రాజ్యాంగాన్ని రాసిన గొప్ప వ్యక్తి అని ఆ రాజ్యాంగమే ప్రపంచంలోనే అత్యున్నత మైనదని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో నాయకులు నూనె వెంకటస్వామి, దైద రవీందర్ గుడిపాటి లక్ష్మీ నరసింహ, జిట్టా నగేష్ పోకల అశోక్, చికిలం మెట్ల అశోక్,మాస శ్రీనివాస్ వివిధ ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.