SAKSHITHA NEWS
Bollywood singer's complaint against IAS Rohini Sindhuri

ఐఏఎస్‌ రోహిణి సింధూరిపై బాలీవుడ్ సింగర్ ఫిర్యాదు

కర్ణాటక క్యాడర్‌కు చెందిన తెలుగు ఐఏఎస్‌ అధికారిణి రోహిణి సింధూరి మరో వివాదంలో చిక్కుకున్నారు. తన భూమిని ఆక్రమించారని ఆరోపిస్తూ ఆమెపై బాలీవుడ్‌ గాయకుడు లక్కీ అలీ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫిర్యాదు కాపీని ‘ఎక్స్‌’లో పంచుకున్నారు. బెంగళూరు శివారులోని యెలహంక ప్రాంతంలో తన వ్యవసాయ భూమిని ఐఏఎస్‌ రోహిణి, ఆమె భర్త సుధీర్‌ రెడ్డి, బంధువు మధుసూదన్‌ రెడ్డి అక్రమంగా లాక్కొన్నారని ఆరోపించారు..