రక్తదాన శిబిరం ఏర్పాటు…. ప్రారంభించిన ఎంపీపీ దొంత కిరణ్ గౌడ్
ప్రకాశం..జిల్లా
యర్రగొండపాలెం : యర్రగొండపాలెం పట్టణంలోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం సమావేశం హాల్లో మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం యర్రగొండపాలెం ఈసి కందుల అనిల్ కుమార్ సొసైటీ ఫర్ ఎన్విరాంన్మెంటల్ విల్లెజి ఆక్టివిటీస్ (సేవ) అనే సొసైటీని స్థాపించి నిరు పేద ప్రజలను గుర్తించి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.కందుల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది.ఇందులో భాగంగా ఉపాధి హామీలో పని చేస్తున్నటువంటి సిబ్బంది రక్తదాన శిబిరంలో రక్తదానం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో రక్తం అవసరమై ఎంతోమంది అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేసి మానవత్వం చాటుకోవడం ఎంతో అవసరమన్నారు.రక్తదానం ప్రాణదానంతో సమానం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సాయి కుమార్,జడ్పిటిసి చేదూరి విజయభాస్కర్, సర్పంచ్ అరుణ భాయి, డాక్టర్ శ్రీనివాసరావు, ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు.
రక్తదాన శిబిరం ఏర్పాటు…. ప్రారంభించిన ఎంపీపీ దొంత కిరణ్ గౌడ్
Related Posts
ఏపీలో అంగన్వాడీలకి రూ.52.68 కోట్లు
SAKSHITHA NEWS అమరావతి : ఏపీలో అంగన్వాడీలకి రూ.52.68 కోట్లు ఏపీ రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి సదుపాయాలకు రూ.52.68 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. స్త్రీ, శిశు సంక్షేమశాఖపై బుధవారం ఆమె సమీక్షించారు.…
కలెక్టర్ తో కలిసి స్థల పరీశీలన చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ
SAKSHITHA NEWS సాక్షిత పల్నాడు జిల్లా, గురజాల. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారాచంద్రబాబు నాయుడు గారి పర్యటన సందర్భంగా కలెక్టర్ గారితో కలిసి స్థల పరీశీలన చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాస రావు ఐపీఎస్ గారు 🔰పల్నాడు…