ఓటు అడిగే హక్కు ఒక్క జగన్మోహన్ రెడ్డికే ఉంది
రాష్ట్రంలో రూ 2,570 కోట్లు రుణమాఫీ ద్వారా మహిళల ఖాతాల్లోకి నగదు జమ
నాలుగో విడతలో నియోజకవర్గంలో 4572 గ్రూపులకు రూ. 37.87 కోట్ల లబ్ది
” ఆసరా ” కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు
సత్తెనపల్లి :
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నాలుగు విడతలలో డ్వాక్ర రుణమాఫీ చేసి…,మాట నిలబెట్టుకున్న ప్రభుత్వాన్ని ..మహిళలు ఆశీర్వదించాలని రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు అంబటి రాంబాబు అన్నారు. సోమవారం వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో జరిగిన పట్టణ ,రూరల్ మండలాల పొదుపు సంఘాల ఆసరా వారోత్సవాలలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ముందుగా అక్క,చెల్లెమ్మలకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం మంత్రి అంబటి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గత ఎన్నికల సమయంలో రైతు, డ్వాక్రా రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి హామీని చెత్తలో పడేసి దుర్మార్గపు పాలన చేశారని విమర్శించారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇచ్చిన మాట మేరకు రూ25750 కోట్లను డ్వాక్రా రుణమాఫీ చేసి అక్క చెల్లెమ్మల వద్ద ఓటు వాడికి హక్కు సాధించారన్నారు.
కరోనా సమయములోనూ రాష్ట్రం ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడినా సంక్షేమ పథకాలను అందించి పేదల బ్రతుకుకు భరోసా కల్పించారన్నారు. గత నాలుగున్నరేళ్లలో ఒకే ఒక్క బటన్ నొక్కి కోట్ల రూపాయల నిధులను నేరుగా లబ్ధిదాల ఖాతాల్లోకి జమ చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. మహిళలు మీరు రానున్న ఎన్నికల్లో రెండే రెండు బటన్ లు ఒకటి ఎంపీ అభ్యర్థికి మరోది ఎమ్మెల్యేలకు నొక్కి ఇక్కడ నన్ను రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం పట్టణంలోని 702 సంఘాలలో 6936 మంది సభ్యులకు గాను రూ 5.68 కోట్లు, రూరల్ మండల పరిధిలోని 1318 సంఘాలకు
చెందిన 12,859 మంది సభ్యులకు గాను రూ.10.91 కోట్ల ఆసరా నమూనా చెక్కులను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో గుంటూరు ఏఎంసి చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ , వైఎస్ ఆర్ సిపి పట్టణ, రూరల్ పార్టీ కన్వీనర్లు, మునిసిపల్, మండల పరిషత్ ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్లు నాయకులు, వైఎస్ఆర్సిపి అనుబంధ సంఘాల బాధ్యులు, పొదుపు సంఘాల సభ్యులు తదితరులు ఉన్నారు