ఘనంగా బిజెపి రాష్ట్ర నాయకులు శేపూరి రవీందర్ జన్మదిన వేడుకలు
— హాజరైన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, సినీనటి కవిత
చిట్యాల సాక్షిత ప్రతినిధి
బిజెపి రాష్ట్ర నాయకులు శేపూరి రవీందర్ జన్మదిన వేడుకలని ఘనంగా నిర్వహించారు. చిట్యాల లోని రాజరాజేశ్వరి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన బిజేపి రాష్ట్ర నాయకులు శేపూరి రవీందర్ జన్మదిన వేడుకలకి ముఖ్య అతిధిగా హాజరైన భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ కేకు కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని అదేవిధంగా నకిరేకల్ నియోజకవర్గంలో శెపూరి రవీందర్ లాంటి నాయకుడిని మీరందరూ మద్దతు తెలిపి భారీ మెజారిటీతో గెలిపించి మన ప్రధాని నరేంద్ర మోడీ ని బలపరుస్తారని ఆశిస్తున్నామన్నారు. నియోజకవర్గం లో ఏ ఇంట్లో ఏ ఆపద వచ్చినా అన్నా అంటే నేనున్నానని ఒక భరోసానిచ్చేటువంటి ప్రజా నాయకుడు రవీందర్ అని గత 20 సంవత్సరాలుగా తన రాజకీయ జీవితంలో ఎన్నో విజయాలు సాధించి ప్రజలకు సేవలు అందించి ప్రజా ఆశీర్వాదం పొందారన్నారు. అదేవిధంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. బిజెపి రాష్ట్ర నాయకులు శేపూరి రవీందర్ మాట్లాడుతూ జన్మదిన వేడుకలకి వచ్చినటువంటి మహిళా సోదరీమణులకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా ఇక ముందు ముందు కూడా మహిళా సోదరీమణులు నాకు మద్దతునిచ్చి రానున్న ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించాలని కోరారు.
ఈ ప్రాంత అభివృద్ధి కొరకై అహర్నిశలు శ్రమిస్తానని ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని తెలిపారు. అనంతరం మహిళలందరికీ చీరలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకురాలు సినీనటి కవిత, నకిరేకల్ అసెంబ్లీ కన్వీనర్ మైల నరసింహ, బిజెపి నల్గొండ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు, చిట్యాల మండల అధ్యక్షులు పొట్లపల్లి నరసింహ, పట్టణ ప్రధాన కార్యదర్శి గంజి గోవర్ధన్, నకిరేకల్ రూరల్ మున్సిపాలిటీ అధ్యక్షులు యానాల శ్రీనివాస్ రెడ్డి, పల్సా శ్రీను గౌడ్, నార్కట్పల్లి మండల అధ్యక్షులు కొరివి శంకర్, కేతపల్లి మండల అధ్యక్షులు రాచకొండ గోపి, ఎస్సి మోర్చా రాష్ట్ర నాయకులు మాస శ్రీనివాస్, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె వెంకన్న, ఎస్సీ సెల్ కోరబోయిన లింగస్వామి, సీనియర్ నాయకులు చికిలం మెట్ల అశోక్, గుండాల నరేష్ గౌడ్, పాపాని వనజ వాసుదేవ్, బొడిగ లక్ష్మయ్య, పీక వెంకన్న ఇమ్మడి విజయ్, చిట్యాల మండల మహిళా అధ్యక్షురాలు నర్రా మాధవి గోపాల్ రెడ్డి, మైనార్టీ అధ్యక్షులు సలీం, ఓ బి సి మోర్చ అధ్యక్షులు నాగాచారి, కొండే నరేష్, అంతటి వెంకటేష్, పాకాల దినేష్, ఉయ్యాల లింగస్వామి, రాము, రూపాని నరసింహ, వరికుప్పల నరసింహ, భత్తుల వెంకన్న, గుడిపాటి సందీప్ ,సిద్దగాని అశోక్, వెంకన్న ,భత్తుల అనిల్, సైదులు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.