రెజ్లర్లపై లైంగిక వేదింపులకు పాల్పడిన బిజెపి యమ్.పి బ్రిజ్ భూషణ్ ని అరెస్ట్ చేయాలి

Spread the love

రెజ్లర్లపై లైంగిక వేదింపులకు పాల్పడిన బిజెపి యమ్.పి బ్రిజ్ భూషణ్ ని అరెస్ట్ చేయాలి.

-ఐద్వా,డి.వై.యఫ్.ఐ,యస్.యఫ్.ఐ,వ్య.కా.స ప్రజా సంఘాల అధ్వర్యంలో బీజేపీ యమ్.పి భూషణ్ దిష్టిబొమ్మ దహనం.

-బీజేపీ,మోడీ ప్రభుత్వం వెంటనే కేసు నమోదు చేసి,యమ్.పి సభ్యత్వాన్ని రద్దు చేయాలి.

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఢిల్లీలో రెజ్లర్లపై లైంగిక వేదింపులకు పాల్పడిన బిజెపి యమ్.పి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై వెంటనే ఫోక్షో చట్టం క్రింద మోడి,బీజేపీ ప్రభుత్వం వెంటనే కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని యమ్.పి సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఐద్వా రాష్ట్ర నాయకురాలు బుగ్గవీటి.సరళ,వ్య.కా.స జిల్లా కార్యదర్శి పొన్నం.వెంకటేశ్వర్లు, డి.వై.యఫ్.ఐ జిల్లా కార్యదర్శి షేక్.బసీరుద్దిన్,యస్.యఫ్. ఐ జిల్లా అధ్యక్షుడు టి.ప్రవీణ్ లు డిమాండ్ చేశారు.

ఢిల్లీలో రెజ్లర్లపై లైంగిక వేదింపులకు పాల్పడిన బిజెపి యమ్.పి బ్రిజ్ భూషణ్ ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఐద్వా,డి.వై.యఫ్.ఐ,యస్.యఫ్.ఐ,వ్య.కా.స ప్రజా సంఘాల కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా స్థానిక యన్.యస్.పి రోడ్డు సెంటర్ లో బిజెపి యమ్.పి భూషణ్ దిష్టిబొమ్మని దహనం చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఐద్వా జిల్లా అధ్యక్షులు బండి.పద్మ,డి.వై.యఫ్.ఐ జిల్లా నాయకుడు చింతల.రమేష్,వ్వ.కా.స జిల్లా అధ్యక్షుడు మెరుగు.సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన నిరసన సభలో వారు మాట్లాడుతూ ఢిల్లీలో రెజ్లర్లపై ఆ సంస్థ అధ్యక్షుడు అయిన బిజెపి యమ్.పి మాపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు అన్ని వీడియో,ఆడియో రికార్డ్స్ తో ఆధారాలతో సహా ఏడుగురు రెజ్లర్లపై(అందులో ఒకరు మైనర్) కేసు పెట్టిన ఢిల్లీ పోలీసులు కనీసం యఫ్.ఐ.ఆర్ కుడా నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమాజానికి సిగ్గు చెట్టని వారు ఆవేదన వ్యక్తం చేశారు.మల యుద్దం చేస్తూ భారత దేశానికి కీర్తి ప్రతిష్టలు తెస్తున్న మహిళ రెజ్లర్లపై లైంగిక వేధింపులకు గురి చేస్తుంటే బిజెపి,మోడి ప్రభుత్వం చోద్యం చూస్తుందని వారు అన్నారు.బాధితులు చివరికి సుప్రీం కోర్టుకు వెలాల్సిన దుస్తితి వచ్చిందని,బిజెపి,మోడి పాలనలో మహిళలకు అసలు రక్షణ లేదని రెజ్లర్లపై లైంగిక వేదింపులకు పాల్పడటం దారుణమని వారు తెలిపారు.వెంటనే ఢిల్లీలో రెజ్లర్లపై లైంగిక వేదింపులకు పాల్పడిన బిజెపి యమ్.పి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై వెంటనే ఫోక్షో చట్టం క్రింద మోడి,బీజేపీ ప్రభుత్వం వెంటనే కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని యమ్.పి సభ్యత్వాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.లేని పక్షంలో తమ సంఘాల అధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి భూక్యా.వీరభద్రం, ప్రజా సంఘాల నాయకులు మెరుగు.రమణ,కొండబోయిన.నాగేశ్వరరావు,బాగం.అజితా,కూరపాటి.శ్రీను,తరుణ్ ,లీలా,జ్యోతి,భారతమ్మ,భులక్ష్మి, ఉమా,వెంకట లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page