SAKSHITHA NEWS

పట్టణంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టిన బిజెపి

*సాక్షిత వనపర్తి : * వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 33 వ వార్డు వల్లబ్ నగర్ లో పట్టణ బిజెపి శాఖ అధ్యక్షులు బచ్చు రాము ఆధ్వర్యంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఎ సుమిత్రమ్మ సర్పంచ్ దేవేందర్ నాయుడు మహిళా మాజీ అధ్యక్షులు కల్పన మహిళా జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి కవిత జ్ఞానేశ్వర్ లు పాల్గొని పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి నేరుగా చేరవేయాలి అన్న సదుద్దేశంతో ఆన్లైన్లో పెట్టడం జరుగుతుందని పార్టీ సభ్యత్వం నమోదు చేసుకొని 8800002024 నెంబర్కు మిస్సేడ్ కాల్ చేసిమీ బయోడేటా పెడితే చాలు ప్రతి పథకం వివరాల తోపాటు సభ్యత్వం తీసుకున్న వారికి ఇన్సూరెన్స్ ఇలాంటి వివరాలు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నేరుగా అందుతాయని తెలిపారు ఇప్పటికే దేశవ్యాప్తంగా 18 కులాల కులవృత్తుల ప్రోత్సహించేందుకు విశ్వకర్మ పథకం ద్వారా కోట్ల కుటుంబా లు వనపర్తి లో 4వేల కుటుంబాలు నమోదు చేసుకోవడం జరిగిందని వీరందరికీ శిక్షణ అనంతరం లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుందని ప్రతి ఒక్కరు పార్టీ సభ్యత్వ నమోదు చేసుకుని ప్రభుత్వ వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందవచ్చు అని విజ్ఞప్తి చేశారు.


SAKSHITHA NEWS