నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట బీజేపీ ధర్నా
సాక్షిత : నిజాంపేట్ కార్పొరేషన్ లో 2019 కంటే ముందున్న పాత ప్లాట్లకు, భవనాలకు రెండింతలు పెంచిన ఆస్తి పన్నును తగ్గించాలి – కూన శ్రీశైలం గౌడ్ *
నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో 2019 కంటే ముందు ఉన్న పాత ప్లాట్లకి, భవనాలకు రెండింతల పెంచిన ఆస్తి పన్నును తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిజాంపేట్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షులు ఆకుల సతీష్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ , డా.ఎస్ మల్లారెడ్డి , తదితర బీజేపీ నాయకులతో కలిసి ధర్నాకు దిగారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ.. నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలోని 3,4,5 అంతస్తులో ప్లాట్ లకి ఆస్తి పన్ను రెండింతలు పెంచిన అధికార బీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే వాటిని తగ్గించాలని డిమాండ్ చేశారు. కొత్తగా ఏర్పాటైన ఏ ఒక్క కార్పొరేషన్ లో కూడా పన్నులు పెంచలేదని, కానీ నిజాంపేట్ లో మాత్రం ప్రజలపై పన్నుల భారం మోపుతుందని మండిపడ్డారు. తక్షణమే రెండింతలు చేసిన పన్నులను తగ్గించాలని, సీడీఎంఏ పెంచిన ఆస్తి పన్ను తగ్గిస్తూ కౌన్సిల్లో తీర్మానం చేసి, మున్సిపల్ మంత్రి కేటీఆర్ కి పంపించాలని, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మేయర్ లని డిమాండ్ చేశారు.
25 రోజుల్లో పెంచిన ట్యాక్స్ లను తగ్గించకుంటే కార్పోరేషన్ ముట్టడి చేస్తామని ఆయన హెచ్చరించారు. కార్పొరేషన్ కార్యాలయం ఎదుట జరిగిన నిరసన కార్యక్రమంలో ప్రజలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.